- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉప రాష్ట్రపతి ఎన్నికపై ఇండియా కూటమి సంచలన నిర్ణయం
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పోటీలో నిలిచింది. అలాగే కూటమి అభ్యర్థిగా జస్టీస్ సుదర్శన్ రెడ్డి పేరును ఖర్గే ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం దేశ రాజకీయాలు మొత్తం ఉప రాష్ట్రపతి ఎన్నిక (Election of Vice President) చుట్టు తిరుగుతున్నాయి. ఇందులో భాగంగా అధికార ఎన్డీయే కూటమి (NDA alliance) ఇప్పటికే కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan)ను ప్రకటించింది. అనంతరం కేంద్ర మంత్రులు అన్ని పార్టీల నేతలకు ఫోన్లు చేసి.. కూటమి అభ్యర్థికి మద్దతు తెలపాలని పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి గెలుపుకు అవసరం అయిన సభ్యుల సంఖ్యా బలం ఉన్నప్పటికి.. ఇండియా కూటమి (Alliance of India) ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశంలో కూటమి నేతలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) పేరును ఖర్గే ప్రకటించారు.
ఎవరీ జస్టిస్ సుదర్శన్ రెడ్డి..?
జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఆకుల మైలారంలో జన్మించాడు. 1971లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. అనంతరం ఆయన రాష్ట్ర జారీ స్థాయిలో వివిధ హోదాల్లో పనిచేశారు. ముఖ్యంగా 2007లో భారత సుప్రీంకోర్టు అదనపు న్యాయముర్తిగా పదోన్నతి పొందారు. ఆయన 2011లో పదవీ విరమణ పొందారు. అనంతరం 2013లో గోవా లోకయుక్తగా బాధ్యతలు చేపట్టి వ్యక్తి గత కారణాల వల్ల అక్టోబర్ లో రాజీనామా చేశారు.






