Justice Sanjiv Khanna : సీజేఐగా రిటైర్ అయిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా

by Muthe.Rajitha |

భారత ప్రధాన న్యాయమూర్తి(CJI)గా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna) మంగళవారం పదవీ విరమణ చేశారు.

Justice Sanjiv Khanna : సీజేఐగా రిటైర్ అయిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా
X

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాన న్యాయమూర్తి(CJI)గా విధులు నిర్వహించిన జస్టిస్ సంజీవ్ ఖన్నా(Justice Sanjiv Khanna) మంగళవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు 51వ సీజేఐగా 2024 నవంబర్ 11న బాధ్యతలు చేపట్టారు. ఆరునెలల పదవీ కాలం ముగియడంతో నేడు రిటైర్ అయ్యారు. కాగా సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) బుధవారం బాధ్యతలు చేపట్టబోతున్నారు. గవాయ్ ని సుప్రీంకోర్టు 52వ సీజేఐగా రేపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(President Droupadi Murmu) ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ఈ ఏడాది నవంబర్‌ 23 వరకు సీజేఐగా ఆయన కొనసాగనున్నారు.

జస్టిస్ సంజీవ్ ఖన్నా తన ఆరు నెలల సీజేఐ పదవీ కాలంలో పారదర్శకత, నీతి, న్యాయవ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడంపై దృష్టి పెట్టారు. రిటైర్మెంట్ తర్వాత ఎటువంటి అధికారిక పదవులు తీసుకోకుండా, న్యాయ రంగంలోనే తన సేవలను కొనసాగిస్తానని ఆయన ప్రకటించారు.

సంజీవ్ ఖన్నా ముఖ్యమైన తీర్పులు, సంస్కరణలు : ఎన్నికల బాండ్ల స్కీమ్‌ను రద్దు చేయడం, ఆర్టికల్ 370 రద్దును సమర్థించడం, ఎన్నికల్లో ఈవీఎంల వాడకాన్ని సమర్థించడం వంటి కీలక తీర్పులలో భాగమయ్యారు. అలాగే కేసుల బ్యాక్‌లాగ్‌ను తగ్గించడానికి, క్రిమినల్ కేసుల నిర్వహణను మెరుగుపరచడానికి, అర్జెంట్ కేసుల కోసం ఈమెయిల్/రాతపూర్వక వినతులను ప్రోత్సహించడం వంటి సంస్కరణలను ప్రవేశపెట్టారు.

Next Story