Justice Gavai : సుప్రీంకోర్టు కొత్త CJI గా జస్టిస్ గవాయ్

by Muthe.Rajitha |   (  Updated:2025-04-29 15:42:48  IST  )

సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ఎన్నికయ్యారు.

Justice Gavai : సుప్రీంకోర్టు కొత్త CJI గా జస్టిస్ గవాయ్
X

దిశ, వెబ్ డెస్క్ : సుప్రీంకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తి(CJI)గా జస్టిస్ బీఆర్ గవాయ్(Justice BR Gavai) ఎన్నికయ్యారు. గవాయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఆమోదముద్ర వేశారు. వచ్చేనెల 14న జస్టిస్ గవాయ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ప్రస్తుతం సీజేఐ సంజీవ్ ఖన్నా పదవీ కాలం మే 13న ముగియబోతుంది. అదే రోజున ఆయన పదవీ విరమణ చేయనున్నారు. మహారాష్ట్రకు చెందిన జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ 2003లో మహారాష్ట్ర హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా నియమించబడి, 2005లో శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడ్డారు. 2019లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొంది.. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. మే 14న CJIగా ప్రమాణ స్వీకారం చేయనున్న జస్టిస్ గవాయ్.. రానున్న 6 నెలల పాటు బాధ్యతలు నిర్వహించి, నవంబరులో పదవీ విరమణ చేయనున్నారు.

Next Story