- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి నామినేషన్.. సంతకం చేసిన సోనియా గాంధీ
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి(Justice B. Sudarshan Reddy) నామినేషన్ దాఖలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి(Justice B. Sudarshan Reddy) నామినేషన్ దాఖలు చేశారు. సుదర్శన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ సోనియా గాంధీ(Sonia Gandhi) సహా 20 మంది ఎంపీలు సంతకాలు చేశారు. కాగా, తెలంగాణకు చెందిన జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి స్వస్థలం రంగారెడ్డి జిల్లా ఆకుల మైలారం. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి.. నాలుగున్నరేళ్ల పాటు 2007 నుంచి 2011 వరకూ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అంతకుముందు 2005 నుంచి 2007 వరకు గువహటి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవీ విరమణ అనంతరం గోవా రాష్ట్రానికి తొలి లోకాయుక్త చైర్మన్‌గా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఉన్నారు. జగదీప్ ధన్ఖడ్ రాజీనామాతో ఉప-రాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. దీంతో ఇండియా కూటమి ఆయనకు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అవకాశం ఇచ్చింది. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.






