- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జూన్‌లో 24 లక్షల కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు..టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు!
జూన్‌లో 24 లక్షల కోట్ల యూపీఐ ట్రాన్సాక్షన్లు జరిగాయి. అత్యధిక ట్రాన్సాక్షన్స్ జరిగిన టాప్ టెన్‌లో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా జూన్ నెలలో జరిగిన యూపీఐ లావాదేవీల లెక్కలను ఎన్పీసీఐ విడుదల చేసింది. అత్యధిక యూపీఐ లావాదేవీలు చేసిన రాష్ట్రాల జాబితాలో టాప్ టెన్‌లో రెండు తెలుగు రాష్ట్రాలున్నాయి. 738.37 మిలియన్ ట్రాన్సాక్షన్లతో ఈ జాబితాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా.. 496.56 మిలియన్లతో ఏపీ 8వ స్థానంలో నిలిచింది. అలాగే తెలంగాణలో మొత్తం 1.05 లక్షల కోట్లపైగా విలువైన లావాదేవీలు జరగ్గా.. ఏపీలో 87వేల కోట్లపైగా విలువైన లావాదేవీలు జరిగినట్లు గణాంకాలు తెలిపాయి. ఈ జాబితాలో 2.11 లక్షల కోట్లకుపైగా విలువైన 1741 మిలియన్ ట్రాన్సాక్షన్లతో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో 1.34 లక్షల కోట్ల విలువైన వెయ్యి మిలియన్ లావాదేవీలతో కర్ణాటక, 1.23 లక్షల కోట్ల విలువైన 972 మిలియన్ల ట్రాన్సాక్షన్లతో ఉత్తరప్రదేశ్ మూడో స్థానంలో ఉన్నాయి.
అలాగే దేశంలో అత్యధిక లావాదేవీలు ఫోన్‌పే ద్వారా జరిగినట్లు ఈ గణాంకాలు వెల్లడించాయి. ఈ యాప్ ద్వారా సుమారు 12 లక్షల కోట్ల విలువైన 8547 మిలియన్ల ట్రాన్సాక్షన్లు జరిగాయి. రెండో స్థానంలో గూగుల్ పే, మూడో స్థానంలో పేటీయం ఉన్నాయి. అదే విధంగా ఓవరాల్ యూపీఐ లావాదేవీల్లో 72 శాతం వ్యక్తుల మధ్యనే జరగ్గా.. 28 శాతం మాత్రం మర్చంట్స్ వద్ద జరిగినట్లు ఈ రిపోర్టు పేర్కొంది. ఓవరాల్‌గా జూన్ నెలలో 24 లక్షల కోట్ల విలువైన 18,395 యూపీఐ లావాదేవీలు జరిగినట్లు ఎన్‌పీసీఐ వెల్లడించింది.






