- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్
లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీం కోర్టు.

దిశ, వెబ్ డెస్క్ : లిక్కర్ స్కామ్ లో అరెస్టయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీం కోర్టు. మనీ లాండరింగ్ కేసులో ఈడీ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయగా.. సుప్రీం కోర్టులో మధ్యంతర బెయిల్ పొందిన కేజ్రీవాల్ ను కస్టడీలో ఉండగానే సీబీఐ అరెస్ట్ చేసింది. కాగా కేజ్రీవాల్ మళ్ళీ సుప్రీం కోర్టులో బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేయగా.. అనేక వాయిదాల అనంతరం నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్ట్. కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన కారణాలు అస్పష్టంగా ఉన్నాయని, లిక్కర్ పాలసీ కేసులోని ఎఫ్ఐఆర్ లో కేజ్రీవాల్ ప్రస్తావనే లేదని వాదించారు ఆయన తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వీ. అయితే జ్యుడీషియల్ కస్టడీలో ఉండగానే ఎలా అరెస్ట్ చేస్తారని సీబీఐని కోర్ట్ ప్రశ్నించింది. కస్టడీలో ఉన్నపుడు మళ్ళీ కోర్టు అనుమతి తీసుకోవాల్సి ఉండగా.. మీ ఇష్టానుసారం ఎలా నిర్ణయం తీసుకుంటారని నిలదీసింది. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్ట్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన తీర్పు వెలువరిస్తామని తెలిపింది.






