- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Jpc meeting: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై ప్రజెంటేషన్.. మరోసారి జేపీసీ భేటీ
వన్ నేషన్ వన్ ఎలక్షన్‌పై జేపీసీ లోని సభ్యులందరూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: వన్ నేషన్ వన్ ఎలక్షన్ (One nation one election) పై జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC)లోని సభ్యులందరూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉన్నారని జేపీసీ చైర్మన్ పీపీ చౌదరి (Pp Chowdary) తెలిపారు. మెంబర్లంతా ఒక బృందంగా ఈ అంశంపై పని చేస్తున్నారని చెప్పారు. జమిలీ ఎన్నికలపై అధ్యయనం చేస్తున్న జేపీసీ మంగళవారం సమావేశమైంది. అనంతరం పీపీ చౌదరి మాట్లాడారు. జేపీసీ వల్ల దేశంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయని తెలిపారు. ఎన్నికల్లో ఖర్చు భారీగా తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
జేపీసీ సమావేశంలో జస్టిస్ అవస్థి ఈ అంశంపై ప్రజెంటేషన్ ఇవ్వగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి యూయూ లలిత్ సైతం తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సభ్యుల ప్రశ్నలకు తాము సమాధానం ఇచ్చినట్టు పీపీ చౌదరి తెలిపారు. కాగా, వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును ప్రస్తుతం జేపీసీ సమీక్షిస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 17న లోక్‌సభలో ఒక దేశం-ఒకే ఎన్నికలకు సంబంధించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష సభ్యులు దీనిని వ్యతిరేకించడంతో బిల్లును మరింత అధ్యయనం చేయడానికి జేపీసీకి పంపించారు.






