JPC : జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేపీసీ భేటీ !

by Y. Venkata Narasimha Reddy |

కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు(Jamili Election Bill) అధ్యయనంపై వేసిన జాయింట్ పార్లమెంటు కమిటీ(JPC) తొలి సమావేశం(First Meeting) జనవరి 8వ తేదీన జరుగనుంది.

JPC : జనవరి 8న జమిలి ఎన్నికల బిల్లు జేపీసీ భేటీ !
X

దిశ, వెబ్ డెస్క్ : కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికల బిల్లు(Jamili Election Bill) అధ్యయనంపై వేసిన జాయింట్ పార్లమెంటు కమిటీ(JPC) తొలి సమావేశం(First Meeting) జనవరి 8వ తేదీన జరుగనుంది. ఢిల్లీలోని పార్లమెంటు అపెక్స్ భవనంలో ఉదయం 11గంటలకు జేపీసీ భేటీ కానుంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్(One Nation One Election) కు సంబంధించి రాజ్యాంగ(129వ సవరణ) బిల్లు-2024ను పార్లమెంటు ఇప్పటికే ఆమోదించింది. అయితే ప్రతిపక్షాల డిమాండ్ మేరకు ఈ బిల్లుపై మరింత అధ్యయనానికి కేంద్రం జేపీసీ ఏర్పాటు చేసింది. లోక్ సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలతో మొత్తం 39 మందితో జమిలి బిల్లు జేపీసీని కేంద్రం నియమించింది. ఈ కమిటీ చైర్మన్ గా బీజేపీ ఎంపీ పి.పి.చౌదరిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, పి.పి.చౌదరి, మనీశ్ తివారీతోపాటు ప్రియాంకగాంధీ వాద్రా, బన్సూరీ స్వరాజ్, సంబిత్ పాత్రా, హరీశ్ బాలయోగి తదితరులను జేపీసీ సభ్యులుగా నియమించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, హరీశ్ బాలయోగి, తెలంగాణ నుంచి కె.లక్ష్మణ్ జేపీసీకి నామినేట్ అయ్యారు.

ఎన్డీయే నుంచి 22, ఇండియా నుంచి 10 మంది

జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి ఐదుగురుకి అవకాశం కల్పించారు. అలాగే సమాజ్ వాది పార్టీ (2), తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(2), డీఎంకే(2), వైఎస్సార్సీపీ(1) శివసేన(1), టీడీపీ(1), జేడీ-యూ(1), ఆర్ఎల్డీ(1), ఎల్బీఎస్పీ- ఆర్ వీ(1), జేఎస్పీ(1), శివసేన-ఉద్దవ్(1), ఎన్సీపీ-శరద్ పవార్(1), సీపీఎం(1), ఆమ్ ఆద్మీ పార్టీ(1)కి సైతం స్థానం కల్పించారు. అధికార ఎన్డీయే నుంచి 22 మంది, విపక్ష ఇండియా కూటమి నుంచి 10 మంది జేపీసీకి నామినేట్ అయ్యారు. పార్లమెంట్ ఉభయ సభలో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో చివరి వారానికి సంబంధించిన మొదటి రోజు నాటికి లోకసభకు సమర్పించాల్సి ఉంటుంది.

Next Story