బిహార్ ప్రజలను రేవంత్ అవమానించారు.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

బిహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) గురువారం ప్రచారం చేశారు.

బిహార్ ప్రజలను రేవంత్ అవమానించారు.. జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బిహార్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) గురువారం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిహార్‌లో ఎన్డీఏ కూటమి మరోసారి అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్డీఏ అభివృద్ధి, మహాఘట్బంధన్ విధ్వంసానికి ఎన్నికలు(Bihar Elections) జరుగబోతున్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పరాన్నజీవి పార్టీ అని విమర్శించారు. కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ నాశనం అవుతుందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ ప్రజలను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి చరణ్‌జిత్‌ అవమానించారని మండిపడ్డారు. వాళ్లిద్దరూ అవమానించేలా మాట్లాడినా తేజస్వి యాదవ్ మౌనంగా బిహార్ ప్రజలకు అవమానమని జేపీ నడ్డా సీరియస్ అయ్యారు. కాగా, బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వాడీవేడిగా ఉంది. బిహార్‌లో నవంబరు 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. నవంబరు 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించనున్నారు.

Next Story