- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jp Nadda: రాహుల్‌కు చరిత్రపై అవగాహన లేదు.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా విమర్శలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పై కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) పై కేంద్ర మంత్రి, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా (Jp nadda) తీవ్ర విమర్శలు గుప్పించారు. రాహుల్‌కు చరిత్రపై అవగాహన లేదని వాళ్ల తండ్రి రాజీవ్ గాంధీ, అమ్మమ్మ ఇందిరా గాంధీ , ముత్తాత నెహ్రూలు రాజ్యాంగాన్ని తారు మారు చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారో ఆయనకు తెలియదని ఆరోపించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆదివారం నిర్వహించిన సంవిధాన్ గౌరవ్ అభియాన్ (Gowrav abhiyan) కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ 65 ఏళ్లు దేశాన్ని పాలించిందని, ఆ టైంలో పార్టీ నేతలు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేశారన్నారు. అంతేగాక రాజ్యాంగంలోని ప్రాథమిక నిబంధనలను సైతం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారని విమర్శించారు.
మోడీ ప్రభుత్వం, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా ఇటీవల రాహుల్ చేసిన వ్యాఖ్యల్లో ఇండియన్ స్టేట్ అనే పదాన్ని ఉపయోగించడంపై నడ్డా స్పందించారు. కాంగ్రెస్ నాయకులకు చరిత్ర గురించి ఏమీ తెలియదని అందుకే ఈ తరహా కామెంట్స్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజ్యాంగంలో ఏముందో తెలుసుకోకుండా, చదవకుండా రాజ్యాంగం కాపీని పట్టుకుని తిరుగుతున్న కపటశక్తుల పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశాభివృద్ధి గురించే బీజేపీ ముందు కెళ్తుందని ఆర్టికల్ 370, ఒక దేశం ఒకే పన్ను అమలు చేశామని గుర్తు చేశారు. త్వరలోనే యూనిఫాం సివిల్ కోడ్‌ను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని నొక్కి చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో ఎంతో మందిని జైలుకు పంపి ఇందిరా గాంధీ రాజ్యాంగాన్ని అణచివేశారని మండిపడ్డారు.






