- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాహుల్ గాంధీపై జేపీ నడ్డా ఫైర్
by Satheesh |
రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య హద్దులన్నింటిని అతిక్రమించాడరని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం లేని వారికి ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు. భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఆదివారం చెన్నైలో నిర్వహించిన నేషనల్ యూత్ పార్లమెంట్ ను ఉద్దేశించి వర్చువల్ గా చేసిన ప్రసంగంలో భారతదేశ ప్రజాస్వామ్య విలువల గురించి రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలతో అవమానించడమే కాకుండా మన దేశంలో జోక్యం చేసుకోవాలని విదేశాలను కూడా ఆహ్వానించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మానసికంగా దివాళా తీసిందని ఫైర్ అయ్యారు. దేశ రాజకీయ సంస్కృతిని ప్రధాని నరేంద్ర మోడీ సమూలంగా మార్చివేశారని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
Next Story






