Joymalya: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ ప్రమాణం.. 33కు చేరిన జడ్జీల సంఖ్య

by B.Srinivas |   (  Updated:2025-03-17 14:17:48  IST  )

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి ప్రమాణ స్వీకారం చేశారు. సీజేఐ సంజీవ్ ఖన్నా బాగ్చితో ప్రమాణం చేయించారు.

Joymalya: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చీ ప్రమాణం.. 33కు చేరిన జడ్జీల సంఖ్య
X

దిశ, నేషనల్ బ్యూరో: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్‌మల్య బాగ్చి (Joymalya baagchi) సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. కోర్టు ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా (Sanjeev Khanna) బాగ్చితో ప్రమాణం చేయించారు. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న బాగ్చీని న్యాయమూర్తిగా ఎంపిక చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం ఈ నెల 6వ తేదీన సిఫార్సు చేయగా ఈ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలోనే బాగ్చి బాధ్యతలు చేపట్టారు. దీంతో సుప్రీంకోర్టులో జడ్జీల సంఖ్య 33కు చేరుకుంది. అత్యున్నత న్యాయస్థానంలో మొత్తం 34 మంది న్యాయమూర్తులకు గాను ఒక పోస్టు ఖాళీగా ఉంది.

సుప్రీంకోర్టులో జస్టిస్ బాగ్చి పదవీకాలం ఆరు సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఈ కాలంలో ఆయన ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వహించే అవకాశం ఉంది. 2031 మే 26 నుంచి 2031 అక్టోబర్ 2031 వరకు ఆయన సీజేఐగా బాధ్యతల్లో ఉండనున్నారు. జస్టిస్ బాగ్చి 2011 జూన్ 27న కలకత్తా హైకోర్టు (Calcutta High court) న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత 2021 జనవరి 4 న ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం అదే ఏడాది నవంబర్ 8న మళ్లీ కలకత్తా హైకోర్టుకు ట్రాన్స్ అయ్యారు. అప్పటి నుంచి ఆయన ఆ స్థానంలోనే విధులు నిర్వహిస్తుండగా తాజాగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ప్రమోషన్ లభించింది. హైకోర్టు న్యాయమూర్తిగా బాగ్చీకి న్యాయరంగంలో గణనీయమైన అనుభవం ఉందని కొలీజియం పేర్కొంది.

Read More..

Rajya sabha: రాజ్యసభ నుంచి ప్రతిపక్షాల వాకౌట్.. డూప్లికేట్ ఓటర్ ఐడీపై చర్చకు అనుమతివ్వకపోవడంతో ఆగ్రహం

Next Story