- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Canada Parliament : తప్పు సరిచేసుకున్న జోబైడెన్
by Vemula.Srinu Prasad |
అమెరికా అధ్యక్షుడు తన శత్రుదేశం చైనాను పొగిడారు...

X
న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు తన శత్రుదేశం చైనాను పొగిడారు. అదేంటి ఒకరంటే ఒకరు నిప్పు-ఉప్పులా ఉండేవారు ఇదేలా సాధ్యమైంది అనుకుంటున్నారా.. తాజాగా కెనడా పార్లమెంటులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వలసవాద విధానాలను ఉద్దేశించి మాట్లాడారు. చైనా వలసవాద విధానాలను ప్రశంసిస్తున్నట్లు ఆయన అన్నారు. ఆ వెంటనే తనను తాను సరిచేసుకుంటూ చైనా కాదు కెనడా అని తెలిపారు. చైనా విషయంలో తన వైఖరి ఎంటో అందరికీ తెలిసే ఉంటుందని చెప్పారు. ఇది కాస్తా కెనడా పార్లమెంటులో నవ్వులు పూయించింది. కాగా, యూఎస్ అధ్యక్షుడు ఈ మధ్య పలుమార్లు పొరబడ్డ సంగతి తెలిసిందే.
Next Story






