- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ జీతంతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. అర్హతలు, వివరాలు ఇవే
బ్యాంక్‌లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) శుభవార్త చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్‌ను..

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంక్‌లో ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) శుభవార్త చెప్పింది. 2025 సంవత్సరానికి సంబంధించి ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 417 మేనేజర్ స్థాయి ఉద్యోగాలు భర్తీ చేయనుంది. సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ సేల్స్ మేనేజర్, అగ్రికల్చర్ సేల్స్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతూ.. అందుకు కావలసిన అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఫీజు వివరాలను సైతం వెల్లడించింది.
ఆగస్టు 6న ప్రారంభమైన ఈ దరఖాస్తుల ప్రక్రియ ఆగస్టు 26న పూర్తికానుంది. మేనేజర్ సేల్స్ పోస్టులకు అప్లై చేసేవారు డిసిప్లిన్‌లో గ్రాడ్యుయేషన్ (MBA/PGDM మార్కెటింగ్/సేల్స్) చేసి ఉండాలి. అలాగే ఏదైనా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ లో మూడు సంవత్సరాలు సేల్స్ చేసిన ఎక్స్ పీరియన్స్ కూడా ఉండాలి.
అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ పోస్టులకు అప్లై చేసేవారు అగ్రికల్చర్/హార్టికల్చర్/బయోటెక్నాలజీ/ఫుడ్ టెక్నాలజీ వంటి సంబంధిత రంగాల్లో డిగ్రీ పూర్తిచేసి.. ఒక సంవత్సరం అగ్రిసేల్స్ చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఇక మేనేజర్ - అగ్రిసేల్స్ పోస్టుకు అప్లై చేసేవారు కనీసం 3 సంవత్సరాల అగ్రిసేల్స్ చేసిన అనుభవం కలిగి ఉండాలి.
జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈఎస్ఎం/డీఈఎస్ఎం అండ్ మహిళా అభ్యర్థులైతే రూ.175 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. సంబంధిత పోస్టులకు ఎంపికైన వారి నెలవారీ జీతం రూ.64,820 నుంచి రూ.93,960 వరకూ ఉంటుందని బ్యాంక్ ఆఫ్ బరోడా పేర్కొంది. ఆసక్తికల అభ్యర్థులు www.bankofbaroda.in వెబ్ సైట్ లోకి వెళ్లి కేరీర్స్ విభాగంలో కరెంట్ ఆపర్చునిటీస్ లింక్ పై క్లిక్ చేసి.. ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ చేసి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి.






