- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుండె తరుక్కుపోయే విషాదం.. చావులోనూ కూతురి ప్రాణం కాపాడిన తండ్రి లేఖ
ఉద్యోగం కోల్పోయిన తండ్రి.. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర అప్పుల పాలై.. వాటిని తీర్చలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు.

దిశ, వెబ్‌డెస్క్: ఉద్యోగం కోల్పోయిన తండ్రి.. కుటుంబాన్ని పోషించేందుకు తీవ్ర అప్పుల పాలై.. వాటిని తీర్చలేక మానసిక ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగులమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఆయన.. దాని నుంచి వచ్చే విషవాయువు వల్ల కూతురు ప్రమాదంలో పడకూడదని భావించి.. ఇంటి తలుపుపై ఓ లేఖను అంటించాడు. ఇప్పుడు ఆ లేఖ అందరిచేత కన్నీళ్లు పెట్టిస్తోంది. గుండెలవిసే ఈ విషాద ఘటన గుజరాత్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పూనమ్ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో నివసించే పంకజ్ భన్సాలీ (42) అనే వ్యక్తి 5 నెలల క్రితం ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాతి నుంచి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాడు. కుటుంబ పోషణ, ఈఎంఐల చెల్లింపుల కోసం అప్పులు చేసి.. వాటిని తిరిగి తీర్చలేక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఆ ఒత్తిడిని భరించలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో సెల్ఫాస్ అనే పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే.. ఆ పురుగుల మందు వల్ల ఇల్లంతా విషపూరిత వాయువులు వ్యాపిస్తాయని, లోపలికి వస్తే తన కూతురి ప్రాణాలకే ముప్పని గ్రహించి ఇంటి బయట తలుపుకు లెటర్ అంటించడం స్థానికుల్ని కలచివేసింది.
లెటర్ లో.. మాన్వి బయటే ఉండు.. లోపల విషవాయువు ఉంది, మాస్క్ వేసుకో, నీళ్లు తాగొద్దు అని రాశాడు పంకజ్ భన్సాలీ. చావులోనూ తన కూతురి శ్రేయస్సు గురించి ఆలోచించి చేసిన పని.. గుండెల్ని కలచివేసింది. మే 13న పంకజ్ భార్య, కూతురు అమ్మమ్మ ఇంటికి వెళ్లారు. మే 22న చివరిగా భార్యతో మాట్లాడిన పంకజ్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అనుమానంతో మే 27న బంధువులు ఇంటికెళ్లి చూశారు. తలుపుపై లెటర్ అంటించి ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ అప్పటికే పంకజ్ చనిపోయి ఐదురోజులవ్వగా.. మృతదేహా పూర్తిగా కుళ్లిన స్థితిలో లభ్యమైంది. ఇన్ఫోసిటీ పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టంకు తరలించి.. అనుమానాస్ప మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. అప్పుల ఒత్తిడే ఇందుకు కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.






