- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా మృతి.. ప్రధాని మోడీ సంతాపం
by Ramesh Naini |
హిందీ సాహిత్య ప్రపంచంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూశారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హిందీ సాహిత్య ప్రపంచంలో ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా కన్నుమూశారు. ఆయన మృతి సాహిత్య వర్గాలను తీవ్రంగా కలిచివేసింది. హిందీ సాహిత్యానికి ఆయన చేసిన అమూల్యమైన కృషి చిరస్మరణీయమని పలువురు సాహితీవేత్తలు గుర్తు చేస్తున్నారు. వినోద్ కుమార్ శుక్లా మృతిపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంతాపం తెలిపారు.
‘జ్ఞానపీఠ్ అవార్డు పొందిన ప్రఖ్యాత రచయిత వినోద్ కుమార్ శుక్లా మరణం ఎంతో బాధ కలిగించింది. హిందీ సాహిత్య ప్రపంచానికి ఆయన చేసిన అమూల్యమైన సేవలతో ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి’ అని ప్రధాని పేర్కొన్నారు. శుక్లా మరణంతో హిందీ సాహిత్యానికి తీరని లోటు ఏర్పడిందని సాహిత్యాభిమానులు భావిస్తున్నారు. ట్వీట్ ఇదే..
Next Story






