- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JN Ray Hospital: బంగ్లాదేశ్ రోగులకు చికిత్స చేయబోము.. కోల్‌కతాలోని ఆస్పత్రి కీలక నిర్ణయం
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా కోల్‌కతాలోని ఓ ఆస్పత్రి సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh)లో హిందువులపై జరుగుతున్న అకృత్యాలకు నిరసనగా కోల్‌కతాలోని ఓ ఆస్పత్రి సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్‌కు చెందిన రోగులకు తాము చికిత్స చేయబోమని ఉత్తర కోల్‌కతాలోని మానిక్‌తలా ప్రాంతంలో ఉన్న జేఎన్ రాయ్ హాస్పటల్ (JN Roy hospital) తెలిపింది. బంగ్లాదేశ్‌కు చెందిన ఏ రోగిని నిరవధికంగా చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్చుకోబోమని వెల్లడించింది. ఈ మేరకు శనివారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది. హిందువులపై దాడులకు పాల్పడుతూ, భారత జాతీయ జెండాను అవమానించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆస్పత్రి ఉన్నతాధికారి సుభ్రాంషు భక్త (Subramshu baktha) తెలిపారు. నగరంలోని ఇతర ఆస్పత్రులు సైతం ఇదే తరహా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ‘బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం రావడానికి ఇండియానే కీలక పాత్ర పోషించింది. అయినప్పటికీ వారు భారత వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారు. భారత త్రివర్ణ పతాకాన్ని అవమానించడం సరికాదు. ఈ చర్యలకు నిరసనగా బంగ్లాదేశీయులకు చికిత్స చేయడం మానేయాలని నిర్ణయించుకున్నాం. ఇతర ఆస్పత్రులు సైతం మాకు మద్దతు ఇస్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.






