- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
J&K attack: - పాకిస్థానీయులకు వీసా సేవలు నిలిపివేత
పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్(India - Pakistan) తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం, పాక్ జాతీయులకు (Pakistani Nationals) వీసా సేవలు నిలిపివేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: పెహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్(India - Pakistan) తో దౌత్య సంబంధాలపై భారత్ కీలక నిర్ణయం తీసుకుంటుంది. ప్రస్తుతం, పాక్ జాతీయులకు (Pakistani Nationals) వీసా సేవలు నిలిపివేసింది. వైద్యపరమైన వాటితో సహా ఆ దేశ ప్రజలకు ఇచ్చిన అన్ని వీసాలను రద్దు చేసింది. ఈ మేరకు మన విదేశాంగ శాఖ ఆదేశాలు ఇచ్చింది. ‘ పాక్ జాతీయులకు భారత్ జారీ చేసిన అన్ని చెల్లుబాటు అయ్యే వీసాలు 2025 ఏప్రిల్ 27 నుంచి రద్దుకానున్నాయి. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని మెడికల్ వీసాలు ఏప్రిల్ 29 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్‌ను వీడాలి. భారత పౌరులు పాక్‌లో పర్యటించవద్దని సూచిస్తున్నాం’’ అని విదేశాంగ శాఖ గురువారం ప్రకటన విడుదల చేసింది.
అటారీ-వాఘా బార్డర్
ఇక ఇప్పటికే పాక్ దేశస్థులు అమృత్‌సర్‌లోని అటారీ- వాఘా రోడ్డు మార్గం ద్వారా భారత్‌ను వీడుతున్నారు. దీనిలో భాగంగా పలు పాకిస్థానీ కుటుంబాలు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ వద్దకు చేరుకున్నాయి. మరోవైపు, భారత్‌లోని పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల్లో పనిచేస్తోన్న ఆ దేశ సైనిక సిబ్బంది, అధికారులు దేశం వీడి వెళ్లేందుకు వారం గడువు విధించారు. సార్క్ వీసా మినహాయింపు పథకం ద్వారా మన దేశంలో పర్యటిస్తున్న పాకిస్థానీయులకు అనుమతులు రద్దు చేస్తున్నట్లు తెలిపారు. మే 1 లోగా దేశం వీడాలని ఆదేశించారు. దీనిపైనే విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది.






