Jithendra: 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపుతాడు.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

by B.Srinivas |

2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపే అవకాశం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.

Jithendra: 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపుతాడు.. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
X

దిశ, నేషనల్ బ్యూరో: 2040 నాటికి భారత వ్యోమగామి చంద్రుడిపై కాలుమోపే అవకాశం ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి జితేంద్ర సింగ్ (Jitendra Singh) తెలిపారు. అలాగే 2035 నాటికి దేశానికి సొంత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (Space station) ఏర్పాటవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న రైజింగ్ భారత్ సమ్మిట్ (Rising Bharat Summit) 2025 కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం ప్రసంగించారు. 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగామిని దింపగలమని ఆశిస్తున్నట్టు వెల్లడించారు. భారత అంతరిక్ష సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. యువతకు దేశంలో మంచి అవకాశాలున్నాయని నొక్కి చెప్పారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే ఈ టైంలో నేను యువకుడిగా ఉంటే బాగుండు అని కోరుకుంటున్నట్టు తెలిపారు. నేటి యువతకు సమాన అవకాశాలు దక్కుతున్నాయని, ప్రభుత్వం సైతం యువతను విశ్వసిస్తోందన్నారు.

Next Story