- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
1 బిలియన్ డౌన్ లోడ్‌లతో చరిత్ర సృష్టించిన జియోహాట్‌స్టార్
గతంలో జియో, హాట్ స్టార్ వేరు వేరుగా ఉన్న రెండు సంస్థలు మెర్జ్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చరిత్ర సృష్టిస్తున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: గతంలో జియో, హాట్ స్టార్ వేరు వేరుగా ఉన్న రెండు సంస్థలు మెర్జ్ అయిన తర్వాత ఓటీటీ ప్లాట్ ఫామ్ లో చరిత్ర సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటిగా ఉన్న జియోహాట్‌స్టార్ (JioHotstar) మరో విశేష మైలురాయిని అందుకుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ 1 బిలియన్ (100 కోట్ల) డౌన్‌లోడ్స్‌ను దాటినట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఈ విజయంతో జియోహాట్‌స్టార్ భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా అత్యధికంగా ఉపయోగించే స్ట్రీమింగ్ యాప్‌లలో ఒకటిగా నిలిచింది.
జియో, హాట్‌స్టార్ విలీనంతో ఏర్పడిన ఈ జియోహాట్‌స్టార్ ప్లాట్‌ఫారమ్ క్రీడా ప్రసారాలు, సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, వార్తలు, లైవ్ టీవీ కంటెంట్ వంటి విభిన్న విభాగాల్లో విస్తృతమైన కంటెంట్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఐపీఎల్, వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌ల ఉచిత ప్రసారం ఈ యాప్‌కి విపరీతమైన డౌన్‌లోడ్స్‌ను తెచ్చిపెట్టిందనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే డేటా సౌకర్యాలు, జియో వినియోగదారులకు అందిస్తున్న ఉచిత స్ట్రీమింగ్ ఆఫర్లు కూడా యాప్ వృద్ధికి కీలక కారణమయ్యాయి. ప్రస్తుతం జియోహాట్‌స్టార్ దేశవ్యాప్తంగా కోట్లాది యాక్టివ్ యూజర్లను కలిగి ఉండగా, కంపెనీ మరిన్ని ప్రీమియం కంటెంట్, టెక్నాలజీ అప్‌డేట్‌లతో వినియోగదారుల అనుభవాన్ని మరింత మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.






