18 సార్లు స్క్రూ డ్రైవర్ తో పొడిచి.. మహిళపై దారుణం

by Naga Rani Yarlagadda |

ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆదివారం ఒక మహిళ రక్తపు మడగులో, శరీరంపై అనేక గాయాలతో విగతజీవురాలై కనిపించింది. ఆమెను స్క్రూడ్రైవర్‌తో హింసించి, కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది.

18 సార్లు స్క్రూ డ్రైవర్ తో పొడిచి.. మహిళపై దారుణం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఆదివారం ఒక మహిళ రక్తపు మడగులో, శరీరంపై అనేక గాయాలతో విగతజీవురాలై కనిపించింది. ఆమెను స్క్రూడ్రైవర్‌తో హింసించి, కిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతురాలిని సైరాగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పురోగతి సాధించారు. సైరాను రఫీ అనే వ్యక్తి హత్యచేసినట్లు మిస్డ్ కాల్స్ ద్వారా నిర్థారించారు.

సైరా శనివారం గడ్డి కోసం ఇంటి నుంచి బయలుదేరింది. కానీ సాయంత్రం వరకు తిరిగి రాలేదు. ఆమె కుటుంబం ఆమె కోసం వెతకడం ప్రారంభించింది. మరుసటి రోజు మొరాదాబాద్‌లోని కోట్వాలీ మైనాథర్‌లోని పొలాల్లో ఆమె మృతదేహం కనిపించింది. ప్రాథమిక దర్యాప్తులో ఆమెను హత్యకు ముందు అత్యాచారం చేసినట్లు అనుమానించారు. ఎందుకంటే ఆమె ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం అయింది. అయితే.. పోస్ట్‌మార్టం నివేదిక ఆమెపై అత్యాచారం జరగలేదని, పదునైన ఆయుధంతో గాయపరిచినట్లు నిర్ధారించింది.

పోలీసులు సైరా మొబైల్ ఫోన్‌ను పరిశీలించగా, ఐదు మిస్డ్ కాల్స్ కనిపించాయి. ఆ కాల్స్ వచ్చిన నంబర్‌ను ట్రేస్ చేయగా.. అది సైరా గ్రామంలోని రఫీ అనే వ్యక్తిదని తేలింది. సైరా తల్లి సఫీనా పోలీసులకు చెప్పిన వివరాల ప్రకారం.. రఫీ ఆమె కూతుర్ని వేధిస్తూ ఉండేవాడు. దీంతో పోలీసులు రఫీని కస్టడీలోకి తీసుకుని విచారించగా అతను సైరాను హత్య చేసినట్లు అంగీకరించాడు. రఫీ చెప్పిన ప్రకారం.. అతను సైరాను ప్రేమించాడు. కానీ ఆమె అతడిని తిరస్కరించింది. కొన్ని రోజుల క్రితం ఆమె గ్రామంలోని ఒక వ్యక్తితో అతన్ని కొట్టించిందని, ఆ వ్యక్తితో సైరాకు సంబంధం ఉందని అతను అనుమానించాడు.

ఆ సంఘటన తర్వాత రఫీ రెండు రోజుల పాటు సైరాను వెంబడించాడు. శనివారం ఆమెను పొలంలోకి అనుసరించి, స్క్రూడ్రైవర్‌తో 18 సార్లు పొడిచాడు. సైరా నొప్పితో విలవిలలాడుతూ తనను వదిలేవేయాలని బతిమాలినప్పుడు, రఫీ ఆమె ప్రైవేట్ భాగాలను స్క్రూడ్రైవర్‌తో గాయపరిచాడు. ఆమె మరణించినట్లు నిర్ధారించుకున్న తర్వాత.. అతను ఇంటికి వెళ్లి స్నానం చేసి, బట్టలు మార్చుకుని నిద్రపోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story