ఎక్సైజ్‌ స్కామ్.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరెస్టు

by Naga Rani Yarlagadda |

మద్యం కుంభకోణం కేసులో ఛత్తీస్‌గఢ్ అవినీతి నిరోధక బ్యూరో.. మంగళవారం జార్ఖండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ చౌబేను అరెస్ట్ చేసింది.

ఎక్సైజ్‌ స్కామ్.. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి అరెస్టు
X

దిశ, వెబ్‌‌డెస్క్: మద్యం కుంభకోణం కేసు (Liquor Scam Case)లో ఛత్తీస్‌గఢ్ అవినీతి నిరోధక బ్యూరో (Chhattisgarh's anti corruption bureau).. మంగళవారం జార్ఖండ్ సీనియర్ ఐఏఎస్ అధికారి వినయ్ కుమార్ చౌబే (Jharkhand IAS vinay kumar choubey)ను అరెస్ట్ చేసింది. 2024 సెప్టెంబర్లో ఏజెన్సీ ఆర్థిక నేరాల విభాగం.. అప్పటి ఎక్సైజ్ కార్యదర్శి చౌబేపై ఎఫ్ఐఆర్ (FIR) దాఖలు చేసింది. రాష్ట్రం మద్యం విధానాన్ని మార్చడం ద్వారా జార్ఖండ్ ఖజానాకు గణనీయమైన ఆర్థిక నష్టం కలిగించారని ఆరోపించింది.

ఎక్సైజ్ కుంభకోణంపై దర్యాప్తులో భాగంగా.. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది అక్టోబర్లో చౌబే, సింగ్‌లకు సంబంధించిన స్థలాలపై దాడి చేసింది. ఎఫ్ఐఆర్‌లో మాజీ ఐఏఎస్ అధికారి అనిల్ తుతేజా, వ్యాపారవేత్త అన్వర్ ధేబర్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర మార్కెటింగ్ కార్పొరేషన్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్‌పతి త్రిపాఠి, ఐఏఎస్ అధికారి మరియు ఛత్తీస్‌గఢ్ మాజీ ఎక్సైజ్ కమిషనర్ నిరంజన్ దాస్, అరవింద్ సింగ్ పేర్లు కూడా ఉన్నాయి. వీరందరూ ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారే.

రాష్ట్ర ఎక్సైజ్ విధానాన్ని సవరించడానికి జార్ఖండ్ అధికారులతో కుట్ర పన్నేందుకు ఒక సిండికేట్ ను ఏర్పాటు చేశారని, సిండికేట్ సభ్యులకు మద్యం సరఫరా టెండర్లను అప్పగించారని, 2022-23 మధ్య ఆర్థిక నష్టాలను కలిగించారని ఎఫ్ఐఆర్ పేర్కొంది. చౌబే, అప్పటి జాయింట్ ఎక్సైజ్ కమిషనర్ సింగ్, వారి సీనియర్ల మద్దతుతో సిండికేట్ కు అనుకూలంగా టెండర్ నిబంధనలను తారుమారు చేశారని, మునుపటి కాంట్రాక్ట్ వ్యవస్థ కారణంగా జార్ఖండ్ సంస్థలు తీర్చలేని తప్పనిసరి టర్నోవర్ షరతుతో సహా ఫిర్యాదులో పేర్కొన్నారు.

Next Story