దారుణం : 10వ తరగతి విద్యార్థినుల షర్ట్స్ విప్పించిన ప్రిన్సిపాల్

by Ajay Maddhiboyina |

10వ తరగతికి చెందిన విద్యార్థినులు పరీక్షలు ముగిసిన తర్వాత 'పెన్ డే' సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

దారుణం : 10వ తరగతి విద్యార్థినుల షర్ట్స్ విప్పించిన ప్రిన్సిపాల్
X

దిశ, నేషనల్ బ్యూరో:

జార్ఖండ్ రాష్ట్రంలో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఒక పాఠశాలలోని విద్యార్థులను తమ షర్ట్స్ విప్పేసి, బ్లేజర్ల మీద ఇంటికి వెళ్లాలని స్కూల్ ప్రిన్సిపాల్ ఆదేశించాడు. ఈ సంఘటన ధన్‌బాద్ జిల్లాలో సంచలనం సృష్టించింది. ధన్‌బాద్ జిల్లా జోరాపోఖర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దిగ్వాద్ ప్రాంతంలోని ఒక ప్రతిష్టాత్మక పాఠశాలలో 80 మంది పదవ తరగతి విద్యార్థునులను షర్ట్స్ విప్పేసి ఇండ్లకు వెళ్లాలంటూ ప్రిన్సిపల్ ఆదేశించారు. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకున్నట్లు ధన్‌బాద్ డిప్యూటీ కమిషనర్ మాధ్వీ మిశ్రా తెలిపారు. 10వ తరగతికి చెందిన విద్యార్థినులు పరీక్షలు ముగిసిన తర్వాత 'పెన్ డే' సెలెబ్రేషన్స్ చేసుకున్నారు. దీనిలో భాగంగా ఒకరి షర్ట్స్‌పై మరొకరు పెన్నులతో సందేశాలు, కోట్స్ రాసుకున్నారు. ఈ సెలబ్రేషన్స్ పట్ల మండిపడిన ప్రిన్సిపాల్.. వెంటనే తమ షర్ట్స్ విప్పి ఇండ్లకు వెళ్లాలని ఆదేశించారు. విద్యార్థునులు క్షమాపణలు చెప్పినా ప్రిన్సిపల్ మనసు కరగలేదని బాధితుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ కమిటీ వేశాం : డీసీ మాధ్వీ మిశ్రా

ప్రిన్సిపాల్ చర్య వల్ల బాధపడిన విద్యార్థునులు అందరూ తమ ఇండ్లల్లో జరిగిన సంఘటనను చెప్పారని.. వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్లు డీసీ మాధ్వీ మిశ్రా తెలిపారు. ఇప్పటికే ఈ ఘటనను స్కూల్ మేనేజ్‌మెంట్ తీవ్రంగా పరిగణించిందని, ఒక విచారణ కమిటీ కూడా వేసినట్లు మిశ్రా తెలిపారు. ఈ కమిటీలో ఒక సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్, జిల్లా విద్యాశాఖాధికారి, జిల్లా సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఒక డీఎస్పీ సభ్యులుగా ఉంటారని మిశ్రా పేర్కొన్నారు. కమిటీ ఇచ్చే రిపోర్టు ఆధారంగా ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకుంటారని మిశ్రా పేర్కొన్నారు. కాగా, బాధితుల తల్లిదండ్రులకు ఝారియా ఎమ్మెల్యే రాగిణి సింగ్ తన పూర్తి మద్దతును ప్రకటించారు.

Next Story