Jharkhand: జార్ఖండ్‌లో ‘ఇండియా’ సీట్ల ఖరారు.. ఏ పార్టీకి ఎన్నంటే?

by vinod kumar |
Jharkhand: జార్ఖండ్‌లో ‘ఇండియా’ సీట్ల ఖరారు.. ఏ పార్టీకి ఎన్నంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: జార్ఖండ్(Jharkhand) అసెంబ్లీ ఎన్నికలకు(Assembly Elections)గాను ఇండియా కూటమి(india alliance) పార్టీల మధ్య సీట్ షేరింగ్(sear sharing) ఖరారైంది. రాష్ట్రంలోని మొత్తం 81 స్థానాలకు గాను జార్ఖండ్ ముక్తి మోర్చా(Jmm) 43, కాంగ్రెస్ (congress) 30, రాష్ట్రీయ జనతాదళ్(Rjd) 6 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అలాగే నిర్సా, సింద్రీ, బగోదర్‌ స్థానాల్లో వామపక్ష అభ్యర్థులు బరిలోకి దిగనుండగా.. ధన్వర్, ఛత్రపూర్, విశ్రాంపూర్ అసెంబ్లీ స్థానాల్లో ఇండియా కూటమి అభ్యర్థుల మధ్య స్నేహపూర్వక పోటీ ఉంటుందని జేఎంఎం ప్రధాన కార్యదర్శి వినోద్‌ పాండే(vinod pandey) వెల్లడించారు. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీలు సంయుక్తంగా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు చెప్పారు. అయితే ఇండియా కూటమి మాత్రం ఇంకా సీట్ షేరింగ్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 13, 20 తేదీల్లో రెండు విడతల్లో జరగనున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.

Advertisement

Next Story

Most Viewed