- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ బ్రేకింగ్.. విద్యాశాఖ మంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం
by Sujitha Rachapalli |
జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రామ్ దాస్ సోరెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో పడిపోయిన ఆయన తలకు తీవ్ర గాయమైంది. ముందుగా అతన్ని స్థానికంగా

X
దిశ, వెబ్ డెస్క్: జార్ఖండ్ విద్యాశాఖ మంత్రి రామ్ దాస్ సోరెన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. నిన్న జంషెడ్‌పూర్‌లోని తన నివాసంలో బాత్‌రూమ్‌లో పడిపోయిన ఆయన తలకు తీవ్ర గాయమైంది. ముందుగా అతన్ని స్థానికంగా ఉన్న టాటా మోటార్స్ ఆస్పత్రిలో చేర్పించగా.. బ్రెయిన్‌లో రక్తం గడ్డకట్టినట్లు గుర్తించారు వైద్యులు. మెరుగైన సేవల కోసం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రత్యేక వైద్యుల బృందం అతనికి చికిత్స అందిస్తుండగా.. ప్రస్తుతం లైఫ్ సపోర్ట్‌పై ఉన్నారు. ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్, హెల్త్ మినిస్టర్ ఇర్ఫాన్ అన్సారీ అతన్ని పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.
Next Story






