- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆస్ట్రేలియా కాల్పులు.. యూదులే లక్ష్యం!
by Muthe.Rajitha |
ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో ఆదివారం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.

X
దిశ, వెబ్ డెస్క్ : ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ లో ఆదివారం ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో 10 మంది అక్కడికక్కడే మరణించగా.. 50 మంది వరకు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు. అయితే యూదులే లక్ష్యంగా ఈ కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. అయితే యూదులు ఈరోజు నుంచి 8 రోజులపాటు 'హనుక్కా' అనే పండుగను జరుపుకుంటారు. రాత్రిపూట కొవ్వొత్తులు వెలిగించి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. ఇందుకోసం దాదాపు 2 వేల మందికి పైగా యూదులు సిడ్నీలోని బాండీ బీచ్ కు చేరుకోగా.. వారిపై ఇద్దరు గన్ మెన్లు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. అయితే ఇది ఖచ్చితంగా యూదులపై జరిపిన దాడే అని, ఉగ్రవాదుల నీచమైన చర్య అంటూ ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ ఐజాక్ హెర్జోగ్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
Next Story






