- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JEE Mains: జేఈఈ మెయిన్స్ ఫలితాలు విడుదల.. హైదరాబాద్‌కే ఫస్ట్ ర్యాంక్
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE Main Session-2) ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి (NTA) ఫలితాలను విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ (NTA).. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 పరీక్షలను నిర్వహించారు. అయితే, తాజాగా విడుదలైన ఫలితాల్లో 24 మంది 100 పర్సంటైల్ స్కోర్ సాధించగా అందులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా ఉన్నారు. అయితే, ఫలితాల కోసం కోసం విద్యార్థులు https://jeemain.nta.nic.in/results-for-jeemain-2025-session-1-paper-1-b-e-b-tech/ వెబ్‌సైట్ ద్వారా అప్లికేషన్ నెంబర్, పాస్‌వర్డ్ (Password) ఉపయోగించి లాగిన్ అయి ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధించేందుకు 93.10 శాతం పర్సంటైల్ అవసరం కాగా.. అందులో ఓబీసీ అభ్యర్థులకు 79.43, ఎస్సీలకు 61.15 కట్ ఆఫ్ ,ఎస్టీలకు 47.90 ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 80.38 కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించారు.
తెలుగు విద్యార్థుల ప్రతిభ..
తాజాగా విడుదలైన జేఈఈ మెయిన్ సెషన్-2 (JEE Main Session-2) ఫలితాల్లో తెలుగు విద్యార్థులు అదరగొట్టారు. హైదరాబాద్ (Hyderabad)కు చెందిన ఇద్దరు జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంకును సాధించారు. బనిబ్రత మాజీ (Banibratha Maji), వంగల అజయ్ రెడ్డి (Ajay Reddy) 300కి 300 మార్కులు రావడంతో వారిద్దరికీ NTA ఒకే ర్యాంక్ కేటాయించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో అజయ్‌రెడ్డి (Ajay Reddy) ప్రథమ ర్యాంకు సాధించారు. అతడి సొంతూరు ఏపీలోని నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండల పరిధిలోని తాటిపాడు కాగా 9వ తరగతి నుంచి హైదారాబాద్‌లోనే ఉంటూ చదువుకుంటున్నాడు.






