జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ అతని సొంతం!

by Naga Rani Yarlagadda |

దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ -2026 ఫలితాలను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేసింది.

జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 రిజల్ట్స్ వచ్చేశాయ్.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ అతని సొంతం!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్డ్ -2026 ఫలితాలను ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) రూర్కీ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఉత్తరప్రదేశ్ లోని వారణాసికి చెందిన శుభమ్ కుమార్ 360 మార్కులకు గాను 330 మార్కులు సాధించి.. ఆలిండియా ఫస్ట్ ర్యాంక్ ను కైవసం చేసుకున్నాడు. ఐఐటీ ఢిల్లీ జోన్ కు చెందిన అతను.. జేఈఈ మెయిన్స్ 2026 పరీక్షలో 300 మార్కులకు గాను.. 295 మార్కులతో ఆలిండియా 6వ ర్యాంక్ సాధించడం విశేషం. తాజాగా జేఈఈ అడ్వాన్స్డ్ లో టాప్ ర్యాంక్ సాధించి సత్తా చాటారు.

Next Story