- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
JDU leader: కిడ్నాప్ చేసి.. కర్రలతో దాడి చేసి.. మూత్రం తాగించారు- జేడీయూ నేత
బిహార్‌లోని పూర్నియా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యేపై జేడీయూ నేత సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: బిహార్‌లోని పూర్నియా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. ఆర్జేడీ ఎమ్మెల్యేపై జేడీయూ నేత సంచలన ఆరోపణలు చేశారు. బైసీ నియోజకవర్గనికి చెందిన అధికార జేడీయూకు నేత మొహమ్మద్ రెహాన్ ఫజల్, ఆర్జేడీకి ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్‌పై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే, అతడి సోదరులు తనను కిడ్నాప్ చేసి కొట్టారని ఆరోపించారు. దళిత మహిళకు సంబంధించిన భూ వివాదంలో తనను కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. తనను బైక్‌పై ఎక్కించుకుని ఎమ్మెల్యే నివాసానికి తీసుకెళ్లి రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారని, తాగేందుకు నీళ్లు అడిగితే బలవంతంగా మూత్రం తాగించినట్లు చెప్పారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జేడీయూ నేత ఫిర్యాదు చేయడంతో ఎమ్మెల్యే అహ్మద్ పై కేసు నమోదు చేశారు.
చికిత్స పొందుతున్న జేడీయూ నేత
కాగా, తీవ్రంగా గాయపడిన జేడీయూ నేత ఫజల్.. పూర్ణియా ప్రభుత్వ మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సేకరించిన ఆధారాల మేరకు ఆర్జేడీ ఎమ్మెల్యే సయ్యద్ రుక్నుద్దీన్, అతడి ఐదుగురు సోదరులపై పలు సెక్షన్ల కింద పూర్నియా పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్జేడీ ఎమ్మెల్యే అరెస్ట్ కోసం వారెంట్ జారీ చేస్తామని ఎస్పీ తెలిపారు. మరోవైపు జేడీయూ నేత ఆరోపణలను ఎమ్మెల్యే అహ్మద్ తోసిపుచ్చారు. ఈ ఆరోపణలు రాజకీయ ప్రేరేపితం, నిరాధారమైనవని అన్నారు. తాను కూడా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.






