అవసరమైతే అధ్యక్షుడిని అవుతా...జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు.

అవసరమైతే అధ్యక్షుడిని అవుతా...జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరమైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నారని, ఉత్సాహంగా ఉన్నారని చెప్పారు. ట్రంప్‌తో పనిచేసే వారందరూ వయసులో ఆయన కంటే చిన్నవారే అని కానీ అందరికంటే ఆలస్యంగా పడుకునేది, ఉదయాన్నే మొదట నిద్రలేచేది ఆయనే అని చెప్పారు. కొన్నిసార్లు భయంకర విషాదాలు జరుగుతాయని వాటన్నింటినీ తట్టుకుని ట్రంప్ వాటంన్నింటిని తట్టుకుని మిగిలిన పదవీకాలన్ని పూర్తి చేస్తారని చెప్పారు. ఆయన అమెరికన్లకు మంచి చేస్తారనే నమ్మకం తనకు ఉందని అన్నారు.

ఒకవేళ భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఇదిలా ఉంటే డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఇటీవల అనేక వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన దీర్ఘకాల సిరల వ్యాధితో బాధపడుతున్నారని, అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. మరోవైపు వైట్ హౌస్ మాత్రం ఇది సాధారణ వ్యాధి అని 70ఏళ్లు దాటిన వ్యక్తుల్లో సాధారణంగా కనిపిస్తుందని పేర్కొంది. ఇటీవల ట్రంప్ కూడా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికా గ్రేట్ ఎగెయిన్ ఉద్యమానికి వాన్స్ వారసుడు అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పారు. ఇక ఇప్పుడు వాన్స్ సైతం తాను అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమే అని చెప్పడం అమెరికా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story