Jd vance: భారత్‌కు జేడీవాన్స్.. భార్య ఉషతో కలిసి త్వరలోనే పర్యటించే చాన్స్ !

by B.Srinivas |

అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరితో కలిసి భారత్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది.

Jd vance: భారత్‌కు జేడీవాన్స్.. భార్య ఉషతో కలిసి త్వరలోనే పర్యటించే చాన్స్ !
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (Jd vance) తన భార్య యూఎస్ సెకండ్ లేడీ ఉషా చిలుకూరి (Usha chilukuri)తో కలిసి భారత్‌లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. వారిద్దరూ తమ తమ హోదాల్లో ఈ నెల చివరలో ఇండియాకు రానున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. యూఎస్ వైస్ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన తర్వాత వాన్స్ భారత్‌కు రావడం ఇదే తొలిసారి కానుంది. అంతకుముందు ఆయన గత నెలలో ఫ్రాన్స్, జర్మనీలను సందర్శించారు. ఈ పర్యటన తర్వాత వాన్స్ చేస్తున్న రెండో అంతర్జాతీయ పర్యటన భారత్ దే. అంతేగాక ఆంద్రప్రదేశ్‌కు చెందిన తెలుగు మూలాలున్న ఉష చిలుకూరి సైతం సెకండ్ లేడీ హోదాలో భారత్‌కు రావడం ఇదే తొలిసారి. కాగా, 2025న జనవరి 21న ఉషా వాన్స్ భర్త జేడీ వాన్స్ అమెరికా 50వ ఉపాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉషా వాన్స్ యూఎస్ సెకండ్ లేడీ అయ్యారు. ఆమె పూర్వీకులు ఏపీకి చెందిన వారు కాగా ఆ గ్రామాన్ని ఉష సందర్శించనున్నట్టు తెలుస్తోంది.

తన మొదటి విదేశీ పర్యటన సందర్భంగా వాన్స్ మ్యూనిచ్ భద్రతా సమావేశంలో అక్రమ వలసలు, మత స్వేచ్ఛ, ఎన్నికల సమగ్రతపై యూరోపియన్ ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలపై రష్యా-ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై చర్చలు జరుపుతున్న మిత్రదేశాలు ఆయన ప్రసంగంతో ఆశ్చర్యపోయాయి. దీంతో ఆయన భారత పర్యటనపై ఆసక్తి నెలకొంది. కొద్ది రోజులుగా టారిఫ్స్ అంశంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. భారత్ పై టారిఫ్స్ పెంచుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో ఈ అంశంపై ఇరు దేశాల మధ్య చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే వాన్స్ పర్యటన జరగనుండడం గమనార్హం.

Next Story