Jayalalithaa Assets : జయలలిత రూ.4000 కోట్ల ఖజనా..తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత !

by Y. Venkata Narasimha Reddy |

దేశంలోని సంపన్న సీఎంలలో ఒకరిగా జీవించినంత కాలం విలాసవంతమైన ఆడంబర జీవితాన్ని గడిపిన జయలలిత ( Jayalalithaa)ఆస్తులు(Assets)చిట్టా వివరాల కథనాలు ఎప్పుడు తెరపైకి వచ్చిన ఆసక్తకరంగానే నిలుస్తుంటాయి

Jayalalithaa Assets : జయలలిత రూ.4000 కోట్ల ఖజనా..తమిళనాడు ప్రభుత్వానికి అప్పగింత !
X

దిశ, వెబ్ డెస్క్ : దేశంలోని సంపన్న సీఎంలలో ఒకరిగా.. జీవించినంత కాలం విలాసవంతమైన ఆడంబర జీవితాన్ని గడిపిన తమిళనాడు మాజీ సీఎం జయలలిత ( Jayalalithaa)ఆస్తులు(Assets)చిట్టా వివరాల కథనాలు ఎప్పుడు తెరపైకి వచ్చిన ఆసక్తకరంగానే నిలుస్తుంటాయి. తాజాగా జయలలితకు చెందిన రూ.4000 కోట్ల ఆస్తులు తమిళనాడు ప్రభుత్వాని(Government of Tamil Nadu)కి చేరాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు(Disproportionate Assets Case)కు సంబంధించి తమిళనాడు దివంగత సీఎం జయలలితకు చెందిన ఆస్తులు, పత్రాలను ఆ రాష్ట్ర ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు Bangalore Courtఅధికారులు అప్పగించారు.

బెంగళూరు పరప్పన అగ్రహార కారాగారంలో ఇప్పటి వరకు జయలలిత ఆస్తులు, పత్రాలను భద్రపరిచారు. 10,000 చీరలు, 750 జతల పాదరక్షలు, 27 కిలోల బంగారం, వజ్రాభరణాలు, రత్నాలు, 601 కిలోల వెండి వస్తువులు, 1,672 ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలు, నివాసాలకు సంబంధించిన దస్తావేజులు, 8,376 పుస్తకాలు తదితరాలను తీసుకు వెళ్లేందుకు భారీ భద్రతతో అధికారులు ఆరు ట్రంకు పెట్టెలు తీసుకువచ్చారు. న్యాయమూర్తి హెచ్ఎన్ మోహన్ సమక్షంలో వాటిని అధికారులకు అప్పగించారు. చక్రవర్తుల ఖజానాను తలపించేలా ఉన్న జయలలిత ఆస్తుల వివరాలు చూసి జనం విస్తుపోతున్నారు. జప్తు చేసుకున్న సమయంలో ఈ ఆస్తుల విలువను 913.14 కోట్లుగా అధికారులు మదింపు వేయగా.. అది నేడు కనీసం రూ.4,000 కోట్లుగా ఉండొచ్చని అనధికారికంగా చెబుతున్నారు.

జయలలిత అక్రమార్జనకు సంబంధించిన కేసు 2004లో తమిళనాడు నుంచి కర్ణాటకకు బదిలీ అయినప్పుడు అక్కడ జప్తు చేసిన ఆస్తులు, పత్రాలను ఇక్కడికి తీసుకువచ్చి భద్రపరిచారు. మరోవైపు తాము జయలలితకు వారసులమని, ఆ ఆస్తులను తమకే అప్పగించాలని జె. దీపక్, జె దీప అనే వ్యక్తులు దాఖలు చేసిన అర్జీని కర్ణాటక హైకోర్టు ఇదివరకే కొట్టివేసింది. దాన్ని సవాల్ చేస్తూ వారు సర్వోన్నత న్యాయస్థానంలో వేసిన పిటిషన్ ను సైతం సుప్రీంకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది.

Next Story