- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TAMILNADU POLITICS: ఎంజీఆర్‌కు జయలలిత.. విజయ్‌కి త్రిష
విజయ్ గెలుపు వెనుక త్రిషనే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ చర్చ కూడా మొదలైంది. ఎంజీఆర్‌కు జయలలిత ఎలానో విజయ్‌కి త్రిష అలానే అనుకుంటున్నారు. తమిళనాడు సినిమా, రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత బంధం చారిత్రాత్మకమైనది.

దిశ, వెబ్ డెస్క్: తమిళనాట విజయ్ విజిల్ మోత మోగిస్తోంది. పార్టీ పెట్టి బరిలో దిగిన మొదటి ఎన్నికలకే సీఎం కుర్తీ ఎక్కేలా ఫలితాలు వస్తున్నాయి. ఎన్నికల్లో గెలిచి తీరుతామని మొదటి నుండి చెప్తున్న విజయ్ చేసి చూపించాడంటూ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతున్నాడు. ద్రవిడ రాజకీయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడని ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలో విజయ్ వెంట నడిచిన హీరోయిన్ త్రిష పేరు కూడా ఎక్కువగా వినిపిస్తోంది. విజయ్ భార్య సంగీత ఇప్పటికే విడాకులకు అప్లై చేయడంతో పాటు త్రిష, విజయ్ రిలేషన్ పై సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త తనను పట్టించుకోవడంలేదని త్రిషతోనే తిరుగుతున్నాడని సంగీత ఆరోపించారు. అదే కారణంతో విడాకులు ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. విజయ్ కి ఇది రాజకీయంగా మైనస్ అవుతుందని చాలా మంది భావించారు. కానీ ఫలితాలు అందుకు భిన్నంగా వచ్చాయి. ఇక ఇప్పుడు విజయ్ గెలుపు వెనుక త్రిషనే ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఓ చర్చ కూడా మొదలైంది. ఎంజీఆర్‌కు జయలలిత ఎలానో విజయ్‌కి త్రిష అలానే అనుకుంటున్నారు. తమిళనాడు సినిమా, రాజకీయాల్లో ఎంజీఆర్, జయలలిత బంధం చారిత్రాత్మకమైనది. ఎంజీఆర్, జయలలిత బంధం కేవలం వెండితెరకే పరిమితం అవ్వకుండా రాజకీయాల్లోనూ ఓ అపురూప అధ్యాయంగా మిగిలిపోయింది. జయలలిత, ఎంజీఆర్ మొదటిసారి వెన్నిరా ఆడై అనే సినిమాలో నటించగా ఈ చిత్రంతో జయలలిత కెరీర్ మలుపుతిరిగింది. ఆ తరవాత వీరిద్దరి కాంబినేషన్ లో 28 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కెమిస్ట్రీకి ఎంతో మంది అభిమానులు ఉన్నారు.
ఎంజీఆర్, జయలలిత రాజకీయ జీవితం
ఎంజీఆర్ తనకు మార్గదర్శకుడు గురువు అని అనేకసార్లు చెప్పిన జయలలిత ఆయన పిలుపుతోనే 1982లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అన్నాడీఎంకే పార్టీలో జయలలితను చేర్చుకున్న తరవాత ఆమెను ప్రచార కార్యదర్శిగా నియమించారు. జయలలితకు ఇంగ్లీష్ పై మంచి పట్టు ఉండటంతో తరవాత కాలంలో జాతీయస్థాయిలో గుర్తింపు వచ్చింది. దశాబ్దాల పాటు ఎంజీఆర్, జయలలిత ప్రేమికులు అంటూ తమిళనాట వార్తలు వినిపించాయి. జయలలిత అంటే ఎంజీఆర్‌కు సినిమాలు, రాజకీయాలు మాత్రమే కాకుండా అంతకు మించి అని అందరికీ తెలుసు. తన జీవితంలో జయలలితకు అత్యున్నత స్థానం ఇచ్చారు కూడా. అయితే ఎంజీఆర్‌కు అప్పటికే పెళ్లికావడంతో వీరి బంధం ఎప్పుడూ మిస్టరీగానే ఉండిపోయింది. 1987లో ఎంజీఆర్ మరణించిన సమయంలో జయలలితకు తీవ్ర అవమానాలు ఎదురయ్యాయి. ఎంజీఆర్ పార్థివదేహం వద్ద నిలబడకుండా ఆమెను అడ్డుకున్నారు. వాహనం నుండి కిందకు కూడా తోసివేశారు. ఆ సమయంలో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. అందులో ఒకటి ఎంజీఆర్ భార్య జానకీ రామచంద్రన్ వర్గం ఒకటైతే మరో వర్గం జయలలితది. తరవాత కాలంలో జయలలిత పార్టీని ఏకంగా చేసి ఎంజేఆర్ అసలైన రాజకీయవారసురాలు అనిపించుకున్నారు.
విజయ్ త్రిష ఇలా
ఇక ఇప్పుడు విజయ్, త్రిషల పెళ్లి కూడా జరగలేదు. కానీ త్రిష విజయ్ వెంటే ఉంటున్నారు. తన భార్య విడాకుల ప్రకటన చేసిన తరవాత విజయ్,త్రిష అఫీషియల్ గా ఓ వేడుకలో పాల్గొన్నారు. దాదాపు విజయ్ పార్టీ ప్రకటించిన నాటి నుండి తన భార్యతో దూరంగానే ఉంటున్నారు. ఈ క్రమంలో విజయ్ సినిమాల పరంగా, పొలికల్ మీటింగ్స్ లో జరిగిన తొక్కిసలాట ఘటనల కారణంగా ఎన్నో ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో త్రిషనే ఆయన వెంట ఉండి ధైర్యం చెప్పారనే ప్రచారం ఉంది. సోషల్ మీడియాలో త్రిష నేరుగా టీవీకేకు మద్దతుగా పోస్టులు పెట్టడం, గెలుపు కోసం తిరుమల వెళ్లడం చూస్తుంటే ఆమె విజయ్ గెలుపు కోసం ఎంతలా వేచిచూస్తున్నారో అర్థం అవుతోంది. ఇక టీవీకే లీడింగ్ లోకి రాగానే నేరుగా త్రిష విజయ్ ఇంటికి వెళ్లి కలిశారు. మరోవైపు గతంలోనే తాను ఫ్యూచర్ లో సీఎం అవుతానని మీడియా ముందే చెప్పారు. దీంతో ఇప్పుడు త్రిష పొలిటికల్ ఎంట్రీ ఉండబోతుందని విజయ్ గెలిచే రెండు స్థానాల్లో ఒకదానికి రాజీనామా చేస్తే అక్కడ పోటీ చేస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. అదే జరిగితే తమిళనాట విజయ్, త్రిష మరో ఎంజేఆర్, జయలలిత అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరంలేదు.






