అభిమానిని తోసేసిన జయా బచ్చన్

by Muthe.Rajitha |

బాలీవుడ్ సీనియర్ నటి, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది.

అభిమానిని తోసేసిన జయా బచ్చన్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్ వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. జయాతో సెల్ఫీ తీసుకోబోయిన తన అభిమానిని తోసేసింది. మంగళవారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ గేటు వద్ద జయా ఒక వ్యక్తితో మాట్లాడుతుండగా.. అంతలో ఒక వ్యక్తి వచ్చి ఆమెతో సెల్ఫీ తీసుకోబోయాడు. దాంతో తీవ్ర అసహనానికి గురైన జయా.. అతన్ని పక్కకు తోసేసి, ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తిట్ల దండకం అందుకుంది. జయా ప్రవర్తనపై నెటిజన్స్ మండిపడుతున్నారు.

సెల్ఫీ వద్దని సున్నితంగా వారించవచ్చు కదా అని ఫైర్ అవుతున్నారు. అయితే తన ప్రైవసీకి భంగం కలిగిస్తే ఊరుకునేది లేదని గతంలోనే జయా ఓ పాడ్ కాస్ట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తన అభిమానిని జయ తోసేస్తున్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Next Story