- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Maha Kumbhamela : కుంభమేళా తొక్కిసలాటపై నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) కుంభమేళా తొక్కిసలాట(Kumbhamela Stampede)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : బాలీవుడ్ సీనియర్ నటి, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) ఎంపీ జయా బచ్చన్ (Jaya Bachchan) కుంభమేళా తొక్కిసలాట(Kumbhamela Stampede)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్(UP)లోని ప్రయాగ్‌రాజ్(PrayagRaj)లో జరుగుతున్న మహా కుంభమేళా(Maha Kumbhamela)లో చోటు చేసుకున్న తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను నదిలో పడేశారని తీవ్రమైన ఆరోపణలు చేశారు. మృతదేహాలతో కుంభమేళ నీరు కలుషితమైందని విమర్శించారు. సోమవారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో జయా బచ్చన్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్(UP CM Yogi Adityanath) ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ప్రస్తుతం అత్యంత కలుషితమైన నీరు ఎక్కడ ఉంది? అంటే కుంభమేళాలో ఉందని చిన్న పిల్లలు కూడా సమాధానం చెబుతారని అన్నారు. ఎందుకంటే తొక్కిసలాటలో మరణించిన వారి మృతదేహాలను తమ వైఫ్యల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు నదిలో పారేశారు. నదిలో నీరు తీవ్రంగా కలుషితం అయిందని ఆమె మండిపడ్డారు.
కుంభమేళాను సందర్శించే సామాన్యులకు ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదు. వారికి ఎలాంటి ఏర్పాట్లు లేవన్నారు. తొక్కిసలాట ఘటనపై యూపీ ప్రభుత్వం కంటితుడుపు చర్యలు చేపట్టిందని జయా బచ్చన్ విమర్శించారు. మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని ఆరోపించారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దీనిపై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష పార్టీల నేతలు కుంభమేళాలో జరిగిన తొక్కిసలాట ఘటనపై పార్లమెంట్‌లో విమర్శించారు. కుంభమేళా తొక్కిసలాటలో మరణించిన వారి వాస్తవ సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిందని ఆరోపించారు. దీనిపై పార్లమెంటులో చర్చించాలని డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జనవరి 13 నుంచి మహా కుంభమేళా ప్రారంభం అయింది. అయితే జనవరి 29న మౌని అమావాస్య సందర్భంగా కోట్లాది మంది ప్రజలు తరలిరావడంతో సెక్టార్-2 లో తొక్కిసలాట జరిగి దాదాపు 30 మంది మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.






