- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్ మహిళా ప్రధాని పార్టీకి రికార్డు విజయం!
జపాన్ మహిళా ప్రధాని పార్టీకి రికార్డు విజయం దక్కింది. దిగువ సభకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ జయభేరి మోగించింది.

దిశ, నేషనల్ బ్యూరో: జపాన్‌లో అధికార పార్టీకి అదిరిపోయే విక్టరీ లభించింది. కీలకమైన పార్లమెంటరీ ఎన్నికల్లో పీఎం సనే తకైచీ నేతృత్వంలోని లిబరల్ డెమొక్రటిక్ పార్టీ (ఎల్డీపీ) భారీ విజయం నమోదు చేసింది. జపాన్ దిగువ సభలోని 465 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎల్డీపీ ఏకంగా 316 సీట్లలో విజయం నమోదు చేసింది. ఇంకా కొన్ని సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఈ ఎన్నికల్లో గెలవాలంటే 261 సీట్లు గెలిస్తే చాలు. అయితే తకైచీ నేతృత్వంలోని పార్టీ ఒంటరిగానే మెజార్టీ మార్కు కన్నా ఎక్కువ సీట్లు గెలవడం గమనార్హం. 1955లో ఎల్డీపీ వ్యవస్థాపన తర్వాత ఇన్ని సీట్లు గెలవడం పార్టీ చరిత్రలోనే తొలిసారి. అంతకుముందు 1986లో దివంగత పీఎం యసుహిరో నకాసోనే నేతృత్వంలో ఎల్డీపీ 300 సీట్లు నెగ్గింది. ఇప్పుడు తకైచీ ఆ రికార్డును కూడా బద్దలు కొట్టింది. ఎగువ సభలో ఎల్డీపీకి మెజార్టీ లేకపోయినా.. ఈ విజయంతో కీలకమైన పాలసీల విషయాల్లో బలంగా ముందుకెళ్లేందుకే తకైచీ నిర్ణయించుకున్నట్లు చెప్పారు. చైనాతో భద్రతా సమస్యలు పెరుగుతున్న వేళ.. డిఫెన్స్‌పై దృష్టిపెట్టాలని ఆమె అనుకుంటున్నారు. జపాన్ తొలి మహిళా ప్రధాని అయిన ఆమెకు ఈ భారీ విజయం అద్భుతమైన బూస్ట్ ఇస్తుందని నిపుణులు అంటున్నారు.






