- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జపాన్ కు మెగా భూకంపం ముప్పు.. 2 లక్షల మందికి ప్రాణ గండం
ఇటీవల జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : ఇటీవల జపాన్ లో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మరో వారం రోజుల్లో జపాన్ కు "మెగా భూకంపం" ముప్పు ఉందని జపాన్ వాతావరణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే మెగా భూకంపం రిక్టర్ స్కేల్‌పై 8.0 కంటే ఎక్కువ తీవ్రతతో ఏర్పడవచ్చని అంటున్నారు. టెక్టోనిక్ ప్లేట్లు ఒకదానిలోకి మరొకటి స్లిప్ కావడం వల్ల భారీ చీలికలు ఏర్పడతాయి. సముద్రం కింద ఇవి జరిగితే భారీ సునామీకి దారితీస్తాయి.
ప్రభుత్వ అంచనాల ప్రకారం ఇలాంటి భూకంపం వస్తే దాదాపు 2 లక్షల మంది ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని, దేశ జీడీపీలో సగం వరకు ఆర్థిక నష్టం సంభవించవచ్చని చెబుతున్నారు. జపాన్ చరిత్రలో ఇప్పటివరకు ఏర్పడిన 1923లో కాంటో, 2011 తొహోకు వంటి భూకంపం మళ్ళీ సంభవించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. చిషిమా, జపాన్ ట్రెంచ్ ప్రాంతాల్లో మెగా భూకంపం హెచ్చరికలు అందటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది.






