- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జన్ ధన్ ఖాతాల్లో ఎన్ని రూ.లక్షల కోట్లు ఉన్నాయో తెలుసా?
దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డిపాజిట్ల వివరాలను ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు వెల్లడించారు.

దిశ, వెబ్‌డెస్క్: దేశవ్యాప్తంగా ఉన్న ప్రధానమంత్రి జన్ ధన్ యోజన (PMJDY) కింద ఓపెన్ చేసిన బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డిపాజిట్ల వివరాలను ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం. నాగరాజు వెల్లడించారు. శనివారం హైదరాబాద్ లో అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఇప్పటి వరకు తెరిచిన బ్యాంకు ఖాతాల్లో మొత్తం డిపాజిట్లు రూ.2.75 లక్షల కోట్లు దాటినట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి జన్ ధన్ అకౌంట్లో సగటున రూ.4815 చొప్పున నగదు ఉన్నట్లు తెలిపారు.
పీఎం జన్ ధన్ యోజన పథకం 2014లో ప్రారంభమైంది. 11 సంవత్సరాల్లో 57 కోట్ల మంది పౌరులు బ్యాంకింగ్ వ్యవస్థలోకి అడుగపెట్టినట్లు ఆయన గుర్తుచేశారు. జన్ ధన్ ఖాతాల్లో 78.2 శాతం గ్రామీణ, పట్టణ ప్రాంతాలలోనే ఉండగా.. ఖాతాదారుల్లో 50 శాతం మంది మహిళలే ఉన్నట్లు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికంలోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా వివిధ ప్రభుత్వ సంక్షేమ పథకాల కింద రూ.3.67 లక్షల కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసినట్లు పేర్కొన్నారు. PMJDY ద్వారా ప్రభుత్వ సబ్సిడీలు, పెన్షన్లు నేరుగా పేదలకు చేరుతున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని వివరించారు.






