- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ కాల్పుల్లో జమ్ము పౌరులు మృతి.. పరిహారంపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రకటన
పాక్ దాడిలో చనిపోయిన పౌరులకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) పరిహారం ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్: పాక్ దాడిలో చనిపోయిన పౌరులకు జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (CM Omar Abdullah) పరిహారం ప్రకటించారు. ఒక్కో పౌరుడికి రూ.10 లక్షలు చోప్పున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ -పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. భారత్ పై పాక్ నిరంతరం కాల్పులకు తెగబడుతూ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. దీనిని భారత బలగాలు సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాయి.
గత రెండు రోజులుగా భారత సరిహద్దు రాష్ట్రాలపై పాక్ చేస్తున్న డ్రోన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తోంది. అయితే జమ్ము కశ్మీర్ లో పాక్ జరుపుతున్న షెల్ దాడుల్లో భారత భద్రతా బలగాలతో పాటు పలువురు జమ్ము కశ్మీర్ పౌరులు సైతం మృతి చెందారు. పాక్ దాడుల్లో మృతి చెందిన పోలీస్ అధికారి సహా ఐదుగురు పౌరులకు పరహారంపై సీఎం ఒమర్ అబ్దుల్లా కీలక ప్రకటన చేశారు. పాక్ కాల్పుల్లో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు చొప్పున పరిహారం అందజేయనున్నట్లు ప్రకటించారు.






