- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Attack: కాందహార్ హైజాక్ నిందితుడి ఇంటిలో సోదాలు
ఐసీ 814 ఫ్లైట్‌ను హైజాక్ చేసిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ చీఫ్ ముష్తాక్ అహ్మద్ జర్గర్‌ను ఉగ్రవాదులు విడిపించగా.. శుక్రవారం అతని ఇంటితో పాటు మరో 21 ప్రాంతాల్లో భద్రతాదళాలు సోదాలు చేశాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత కశ్మీర్‌లో భద్రతను కట్టుదిట్టం చేసి.. భద్రతా దళాలు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఐసీ 814 ఫ్లైట్‌ను హైజాక్ చేసిన అల్ ఉమర్ ముజాహిద్దీన్ చీఫ్ ముష్తాక్ అహ్మద్ జర్గర్‌ను ఉగ్రవాదులు విడిపించగా.. శుక్రవారం అతని ఇంటితో పాటు మరో 21 ప్రాంతాల్లో భద్రతాదళాలు సోదాలు చేశాయి. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి పక్కా ప్లాన్ చేసింది పాకిస్థానేనని ఇప్పటికే ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో వెల్లడించింది. లష్కరే తోయిబా అనే సంస్థతో దాడి చేయించిందని పేర్కొంది. దీంతోపాటు అహ్మద్ జర్గర్ కూడా పాక్‌లోనే ఉండటంతో అతని ఇంటిలో తనిఖీలు చేపట్టింది.
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిని రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఎన్ఐఏ (NIA) లేటెస్ట్ టెక్నాలజీని వాడుకుంటోంది. శాటిలైట్ ఇమేజ్‌లు, డ్రోన్ దృశ్యాలను సేకరించడంతో పాటు.. స్థానికంగా ఉన్న గుర్రపుస్వారీ ఆపరేటర్లు, బాధిత కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరిస్తోంది. ఘటనా ప్రాంతం నుంచి 40 ఖాళీ తూటాలను దర్యాప్తు బృందాలు స్వాధీనం చేసుకున్నాయి. మరోవైపు సరిహద్దుల్లో వరుసగా 8వ రోజు కూడా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. సరిహద్దుల వెంబడి కాల్పులు జరపగా.. భారత ఆర్మీ సైన్యం వాటిని తిప్పికొట్టింది.






