పాక్ కాల్పులపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |

ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతున్న వేళ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Jammu Kashmir CM Omar Abdullah) పూంచ్ లో పర్యటిస్తున్నారు.

పాక్ కాల్పులపై జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కొనసాగుతున్న వేళ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా (Jammu Kashmir CM Omar Abdullah) పూంచ్ లో పర్యటిస్తున్నారు. అక్కడ పరిస్థితిపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. పాకిస్థాన్ కాల్పుల వల్ల భారీ నష్టం జరిగిందని, ముఖ్యంగా పూంచ్(Poonch) లో అత్యధిక సంఖ్యలో ప్రాణనష్టం జరిగిందని తెలిపారు. ఈ దాడుల వల్ల చాలామంది ప్రజలు గాయపడ్డారని, జమ్మూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిలో అత్యధికులు పూంచ్ ప్రజలేనని వెల్లడించారు.

ప్రస్తుతం పూంచ్ లో పరిస్థితి దారుణంగా ఉందని అన్నారు. ఇక ఉపముఖ్యమంత్రి పూంచ్ కు చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఆయన వచ్చాక ప్రజలను కలుస్తారని తెలిపారు. అంతకుముందు సీఎం ఒమర్ అబ్దుల్లా సాంబా (Samba)లో సరిహద్దు ప్రాంత ప్రజల కోసం ఏర్పాటు చేసిన సహాయక శిబిరాల్లో పర్యటించారు. సహాయక శిబిరాల్లోని ఏర్పాట్లపై పర్యవేక్షించారు. ఏర్పాట్లపై స్థానికులను ఆరా తీశారు. శిబిరాల్లో రోజుకు మూడు సార్లు ఆహారం అందించడం జరుగుతుందని, పారిశుద్య సౌకర్యాలు, వైద్యులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇక శిబిరాల్లో ఉన్నవారు సురక్షింతంగా ఉంటారని, దాడుల నుంచి తక్కువ సమస్యలను ఎదుర్కొంటారని జమ్ము కశ్మీర్ సీఎం చెప్పారు.

Next Story