- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Jammu Kashmir Cloud Burst : 33 కు పెరిగిన మృతులు, 220 మంది గల్లంతు
జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి చోసిటీలోని కిష్టవర్లో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లో(Jammu Kashmir) నేడు క్లౌడ్ బరస్ట్(Cloud burst) సంభవించి చోసిటీలోని కిష్టవర్లో ఆకస్మిక వరదలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ లో ఇప్పటి వరకు 33 మంది మృతి చెందగా.. 120 మందికి గాయాలు కాగా, 220 మంది గల్లంతయ్యారని అధికారులు పేర్కొన్నారు. మృతుల్లో అధికులు మాచైల్ మాతా మందిరానికి వెళ్లే యాత్రికులున్నట్టు తెలిపారు. అయితే మృతుల్లో ఒక CRPF అధికారి కూడా ఉన్నట్టు సమాచారం. మరోవైపు పహల్గాంను కూడా భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఆర్మీ, నేవి, NDRF, SDRF బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
కాగా ఈ ప్రమాదం నేపథ్యంలో మాచైల్ మాతా యాత్రను రద్దు చేసారు. మరోవైపు ప్రమాద ఘటనపై పీఎం నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లెఫ్టినెంట్ గవర్నర్ తో ఫోన్లో మాట్లాడి పరిస్థితిపై ఆరా తీశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా.. ఆకస్మిక వరదలపై సమీక్ష జరిపారు. అదనపు సైన్యాన్ని, విపత్తు నిర్వహణ బృందాలను చోసిటికి పంపిస్తున్నట్టు పేర్కొన్నారు.






