దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావు: Mallikarjun Kharge

by Mahesh |   ( Updated:2024-09-18 10:46:39.0  )
దేశంలో జమిలి ఎన్నికలు సాధ్యం కావు: Mallikarjun Kharge
X

దిశ, వెబ్‌డెస్క్: వన్ నేషన్, వన్ ఎలక్షన్‌ (జమిలి ఎన్నికలను) నిర్వహించాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే One Nation, One Election నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌‌నాథ్ కోవింద్ (Ram Nath Kovind) నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాగా జమిలి ఎన్నికలపై రామ్‌‌నాథ్ కోవింద్ కమిటీ (Ram Nath Kovind Committee) రూపొందించిన నివేదికకు బుధవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. కాగా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. కేబినెట్ నిర్ణయంపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) స్పందించారు. జమిలి ఎన్నికలు దేశంలో సాధ్యం కావని.. కేంద్రం ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరని.. దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలి ఎన్నికల ప్రస్తావన బీజేపీ ప్రభుత్వం తెరమీదకు తీసుకొచ్చిందని మల్లికార్జున ఖర్గే అభిప్రాయపడ్డారు.

Advertisement

Next Story