టర్కీకి జామియా మిలియా ఇస్లామియా షాక్

by Naga Rani Yarlagadda |

పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు తెలిపిన నేపథ్యంలో భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా బాయ్ కాట్ టర్కీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది.

టర్కీకి జామియా మిలియా ఇస్లామియా షాక్
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు తెలిపిన నేపథ్యంలో భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దేశ వ్యాప్తంగా బాయ్ కాట్ టర్కీ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విశ్వవిద్యాలయం కీలక నిర్ణయం తీసుకుంది. టర్కీలోని వివిధ విద్యాసంస్థలతో గతంలో కుదుర్చుకున్న ఎంఓయూ నిలిపివేస్తున్నట్లు జేఎంఐ అధికారికంగా ప్రకటించింది. విశ్వవిద్యాలయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ సైమా సయీద్ నేషనల్ మీడియాకు తెలియజేశారు.

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత.. పాక్, పాక్ ఆక్రమిత పాకిస్తాన్లో ఉన్న ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. ఆ తర్వాత టర్కీ, అజర్ బైజాన్ దేశాలు పాక్ కు మద్దతు తెలిపాయి. ఆ తర్వాత భారత్ నుంచి టర్కీకి "బాయ్ కాట్ టర్కీ ఎయిర్ లైన్స్"తో నిరసన సెగ తగిలింది. అదే టర్కీ టూరిజంపై బిగ్ ఎఫెక్ట్ చూపించింది. దాదాపు 60 శాతం టూరిజం పడిపోయింది.

Next Story