- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహిళలకు ఆన్ లైన్ లో జిహాదీ కోర్సులు.. కొత్త కుట్రలకు తెర లేపిన పాక్ ఉగ్రసంస్థ
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెల్లెళ్లు కొత్తగా ఆన్ లైన్ లో ఉగ్రవాద పాఠాలు నేర్పేందుకు సిద్ధమయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) దెబ్బకు కకావికలం అయిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ (Jaish-e-Mohammed) తాజాగా తన నెట్ వర్క్ ను విస్తరించుకునేందుకు కొత్త కుట్రలకు తెరలేపుతోంది. ఆ సంస్థ తొలిసారి ప్రత్యేకంగా మహిళలతో ఓ ఉగ్రవాద దళం కోసం జైషే మహిళా బ్రిగేడ్ ను (female terrorist brigade) ఏర్పాటు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అంతే కాదు ఈ మహిళా దళానికి మతపరమైన, జిహాద్ కు సంబంధించిన శిక్షణ ఇచ్చేందుకు ఆన్ లైన్ కోర్సులను సైతం ప్రారంభించినట్లు సమాచారం. 'తౌఫల్ అల్ ముమినత్' పేరుతో ఈ ఆన్ లైన్ కోర్సులను నవంబర్ 8 నుంచి ప్రారంభం కాబోతున్నాయని ఇందులో భాగంగా ప్రతిరోజు 40 నిమిషాల పాటు మహిళా బ్రిగేడ్లకు పాఠాలు బోధించనున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఆన్ లైన్ తరగతులకు హాజరయ్యే మహిళలు జైషే మహ్మద్ సంస్థకు రూ.500 (పాకిస్తానీ రూపాయలు) విరాళంగా ఇవ్వాలని కోరుతున్నారు.
మసూద్ అజార్ సిస్టర్స్ ట్రైనింగ్:
ఈ మహిళా ఉగ్రవాద దళంలోకి తీవ్రవాదుల భార్యలు, పేద మహిళలను రిక్రూట్ చేసుకునేందుకు జైషే మహ్మద్ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మహిలా బ్రిగేడ్‍కు జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ చెల్లెళ్లు సాదియా అజార్, సమైరా అజార్ నాయకత్వం వహిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఆపరేషన్ సిందూర్ సమయంలో బహవల్ పూర్ లోని జైషే ప్రధాన కేంద్రంపై భారత సైన్యం బాంబులు వేసింది. ఆ దాడుల్లో మసూద్ అజార్ కుటుంబానికి చెందిన 10 మృతి చెందారు. మసూద్ బావ, సాదియా భర్త యూసప్ అజార్ కూడా ఉన్నాడు. ఇక మసూద్ మరోసోదరి సమైరా భర్త పుల్వామా ఉగ్రదాడి కుట్రదారు ఉమర్ ఫరూక్ గతంలో భారత ఆర్మీ జరిపిన ఎన్ కౌంటర్‍లో చనిపోయాడు. ఈ ఇద్దరి భార్యలు ఇతర మహిళలను ఉగ్రవాదం వైపు నడిపించేలా ఏకంగా ఆన్ లైన్ కోర్సులే ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. కాగా ఈ కొత్త మహిళా బ్రిగేడ్ భారత్ లో తన నెట్ వర్క్ ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇప్పటికే హెచ్చరించాయి. దీంతో సోషల్ మీడియా, ఆన్ లైన్ నెట్ వర్క్ ల పట్ల భారత అధికారులు అప్రమత్తమైనట్లు సమాచారం.






