Jaishanker: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై డిస్కషన్

by B.Srinivas |

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు.

Jaishanker: చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌తో జైశంకర్ భేటీ.. కీలక అంశాలపై  డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో (jinping) తో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ (Jai shanker) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. రెండు దేశాల మధ్య ఇటీవల జరిగిన పరిణామాలపై జిన్ పింగ్‌కు వివరించారు. ‘నేను బీజింగ్‌లో షాంగై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (ఎస్సీవో) విదేశాంగ మంత్రులతో పాటు అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను కలిశాను. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ తరపున ఆయనకు నా శుభాకాంక్షలు తెలియజేశా. భారత్, చైనాల మధ్య సంబంధాలలో సాధించిన పురోగతి గురించి ఆయనకు తెలియజేశాను’ అని జైశంకర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

కాగా, ఎస్సీవో విదేశాంగమంత్రుల సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్ చైనా వెళ్లిన విషయం తెలిసిందే. అంతకుముందు ఆయన చైనా ఉపాధ్యక్షుడు హాన్ జెంగ్‌, విదేశాంగ మంత్రి వాంగ్ యీలతోనూ సమావేశమయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై సమీక్షించారు. సరిహద్దు సమస్యలపై శ్రద్ధ వహించాలని, ప్రజల మధ్య సంబంధాలను సాధారణీకరించాలని, వాణిజ్యంలో అడ్డంకులను తొలగించడానికి కృషి చేయాలని జైశంకర్ ఈ సందర్భంగా సూచించారు.

Next Story