Jaishanker: చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కషన్

by B.Srinivas |

భారత్ చైనా సంబంధాల్లో పురోగతి సాధించాలంటే సరిహద్దుల్లో శాంతి ఎంతో అవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.

Jaishanker: చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కషన్
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ చైనా సంబంధాల్లో పురోగతి సాధించాలంటే సరిహద్దుల్లో శాంతి ఎంతో అవసరమని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. రెండు దేశాలు క్లిష్ట దశను ఎదుర్కొన్నాయని, ప్రస్తుతం ముందుకు సాగడానికి స్పష్టమైన విధానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. భారత పర్యటనలో ఉన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో జైశంకర్ సోమవారం భేటీ అయ్యారు. సరిహద్దు వివాదం, ద్వైపాక్షిక సంబంధాలపై డిస్కస్ చేశారు. అనంతరం జైశంకర్ మాట్లాడారు. భారత్ చైనా సంబంధాలు మెరుగుపడాలని ఇరు దేశాలు కోరుకుంటున్నాయన్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా పరస్పర గౌరవం, సున్నితత్వం, పరస్పర ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. విభేదాలు వివాదంగా మారకూడదని తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల్లో మనం శాంతి, సామరస్యాన్ని కాపాడుకున్నామని చెప్పారు. బార్డర్‌లో శాంతి నెలకొన్నప్పుడే రెండు దేశాల మధ్య సానుకూల వైఖరి ఉంటుందని స్పష్టం చేశారు. చైనా మంత్రి వాంగ్ యీ మాట్లాడుతూ.. సరిహద్దుల్లో శాంతిని కొనసాగించడానికి మేము ప్రయత్నిస్తున్నామని, మానసరోవర్, కైలాష్ యాత్రలను తిరిగి ప్రారంభించామని తెలిపారు. కాగా, వాంగ్ యీ మంగళవారం ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌లతో భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

Next Story