ఆగస్టు 20-21 తేదీల్లో రష్యా పర్యటనకు జైశంకర్

by Phanindra |

ఆగస్టు 20-21 తేదీల్లో రష్యా పర్యటనకు జైశంకర్ వెళ్లనున్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌తో జైశంకర్ భేటీ అవనున్నారు.

ఆగస్టు 20-21 తేదీల్లో రష్యా పర్యటనకు జైశంకర్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఈ నెల 20-21 తేదీల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటించనున్నారు. అక్కడ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావరోవ్‌తో జైశంకర్ కీలక చర్చలు జరపనున్నారని విదేశాంగ శాఖ వెల్లడించింది. రష్యా నుంచి చమురు కొంటున్న కారణంగా భారత్‌పై అదనంగా 25 శాతం సుంకాలు విధించాలని యూఎస్ నిర్ణయించిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవలే భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా రష్యాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో ఆయన నేరుగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కూడా కలిశారు. ఈ ఏడాది చివర్లో పుతిన్ కూడా భారత్‌లో పర్యటించనున్నారని దోవల్ ప్రకటించారు.

Next Story