- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ట్రంప్ ఒక అమెరికా జాతీయవాది.. ప్రధాని మోడీతో మంచి స్నేహం ఉంది
మనకు అక్కడ ఎంతో గౌరవం లభించింది. ట్రంప్ ఒక అమెరికా జాతీయవాది అని జై శంకర్ పేర్కొన్నారు.

- అమెరికాతో ఇండియా బంధం బలంగా ఉంది
- కాలేజీ విద్యార్థులతో చిట్‌చాట్‌లో ఎస్.జైశంకర్
దిశ, నేషనల్ బ్యూరో:
అమెరికాతో మన ద్వైపాక్షిక బంధం చక్కగా, బలంగా ఉంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో మోడీకి మంచి స్నేహం ఉంది. రాబోయే రోజుల్లో ఇరు దేశాల మధ్య బంధం మరింతగా బలపడుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్. జైశంకర్ అన్నారు. ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో గురువారం ఏర్పాటు చేసిన 'వికసిత్ భారత్ కోసం యువత' అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. కళాశాల విద్యార్థులతో జరిపిన చిట్‌చాట్‌లో ఆయన అనేక విషయాలు వెల్లడించారు. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను హాజరయ్యాను. మనకు అక్కడ ఎంతో గౌరవం లభించింది. ట్రంప్ ఒక అమెరికా జాతీయవాది అని జై శంకర్ పేర్కొన్నారు. ట్రంప్ విధానాలతో రాబోయే రోజుల్లో ప్రపంచ వ్యవహారాల్లో గణనీయమైన మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. అయితే మనకు మాత్రం దేశ ప్రయోజనాలే తొలి ప్రాధాన్యతగా ఉంటాయని.. అమెరికాతో స్నేహం చేస్తూనే.. భారత ప్రయోజనాలు కాపాడతామని జై శంకర్ స్పష్టం చేశారు.
గత 80 ఏళ్లుగా అమెరికా అనవసరమైన విషయాలపై దృష్టి పెట్టింది. అపారమైన డబ్బును ఇష్టానుసారం ఖర్చు చేసింది. అదే డబ్బు అమెరికన్ల కోసం ఖర్చు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ట్రంప్ భావిస్తున్నట్లు జైశంకర్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియా ప్రభావం పెరుగుతోంది. కొందరు భారతీయేతరులు కూడా తాము ఇండియన్స్ అని చెప్పుకుంటున్నారు. విమానంలో సీటు కోసమో.. మరో చోట ఫేవర్ కోసమో అది ఉపయోగపడుతుందని జైశంకర్ అన్నారు. నేను ఒక బ్యూరోక్రాట్‌ను కానీ నా రాజకీయ ప్రవేశం, మంత్రి అవడం అంతా అదృష్టమే. అంతా మోడీ వల్లే జరిగింది. నేను కాదు అని చెప్పలేని పరిస్థితిని మోడీ సృష్టించి.. రాజకీయాల్లోకి తీసుకొచ్చారని జై శంకర్ చెప్పారు.
వికసిత్ భారత్ ఉద్దేశం చాలా స్పష్టంగా ఉంది. యువత లేకుండా వికసిత్ భారత్ లేదని జై శంకర్ అన్నారు. గతంలో సరైన అభివృద్ధి నమూనా లేకపోవడం వల్ల ఆసియా దేశాల అభివృద్ధి వేగాన్ని అందుకోవడంలో కూడా మనం విఫలమయ్యామని జైశంకర్ అభిప్రాయపడ్డారు. జపాన్, కొరియా, చైనా వంటి దేశాలు పరిపాలనలో ఆధునిక విధానాలను అనుసరించి ముందుకు సాగుతున్నాయని చెప్పారు.






