Jaish: జైషే మహమ్మద్ తొలి మహిళా యూనిట్.. ‘జమాత్-ఉల్-మోమినాత్’ పేరుతో ఏర్పాటు

by B.Srinivas |

గ్రవాద సంస్థ జైషే మహమ్మద్ తొలిసారిగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ‘జమాత్-ఉల్-మోమినాత్’ అని పేరు పెట్టింది.

Jaish: జైషే మహమ్మద్ తొలి మహిళా యూనిట్.. ‘జమాత్-ఉల్-మోమినాత్’ పేరుతో ఏర్పాటు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ (Jaish-e-mohammad) తొలిసారిగా మహిళా విభాగాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ‘జమాత్-ఉల్-మోమినాత్’ అని పేరు పెట్టగా ఈ యూనిట్‌కు ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా జరిగిన దాడుల్లో హతమైన ఉగ్రవాది మసూద్ అజార్ సోదరి సాదియా అజార్ (Sadhiya ajar) నాయకత్వం వహించనున్నారు. జైషే మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ పేరుతో ఉన్న ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త విభాగం కోసం అక్టోబర్ 8న బహవల్‌పూర్‌లో నియామకాలు ప్రారంభమయ్యాయి. బహవాల్‌పూర్, కరాచీ, ముజఫరాబాద్, కోట్లి, హరిపూర్, మన్సెహ్రాలోని మదర్సాలలో చదువుతున్న ఆర్థికంగా బలహీనమైన మహిళలతో పాటు, ఉగ్రవాదుల భార్యలను కూడా సంస్థలో రిక్రూట్ చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. జమాత్-ఉల్-మోమినాత్ కార్యకలాపాలు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, కొన్ని మదర్సాల నెట్‌వర్క్ ద్వారా విస్తరించుకుంటున్నట్టు సమాచారం.

గతంలో జైషే మహహ్మద్ సంస్థ మహిళలను పోరాట కార్యకలాపాలలో పాల్గొనకుండా నిషేధించేది. కానీ భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ అనంతరం తీవ్రంగా దెబ్బతిన్న తర్వాత తన రూల్స్ మార్చుకున్నట్టు కనిపిస్తోంది. మసూద్ అజార్, ఆయన సోదరుడు తల్హా అల్-సైఫ్ సంయుక్తంగా జైషే మహమ్మద్‌లో మహిళలను చేర్చాలనే నిర్ణయాన్ని ఆమోదించారని, దీని ఫలితంగానే ప్రత్యేక మహిళా యూనిట్ ప్రారంభమైందని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే ఐఎస్ఐఎస్, బోకో హరామ్, హమాస్, ఎల్‌టీటీఈ వంటి ఉగ్రవాద సంస్థలు మహిళలను ఆత్మాహుతి దాడుల కోసం ఉపయోగించుకునే వారు. దీంతో జైషే మహమ్మద్ సైతం మహిళా ఉగ్రవాదులను ఈ తరహా దాడులకు వాడుకునే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story